News March 15, 2025
ఎర్రుపాలెం: అప్పులు బాధ తాళలేక రైతు ఆత్మహత్య

అప్పులు బాధ తాళలేక కౌలు రైతు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలంలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలిలా.. మొలుగుమాడుకి చెందిన తోట వెంకటేశ్వరరావు అనే రైతు తనకున్న రెండున్నర ఎకరాలతో పాటు మరో ఐదెకరాలు కౌలుకు తీసుకుని మిర్చి సాగు చేశాడు. పంట సరిగా పండకపోవడంతో చేసిన అప్పులు తీర్చలేక బాధతో గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Similar News
News March 16, 2026
నెల్లూరు : మరి కాసేపట్లో మొదలుకానున్న పది పరీక్షలు

10వ తరగతి పరీక్షలు మరి కాసేపట్లో మొదలుకానున్నాయి. పరీక్ష నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లాలో 174 కేంద్రాలలో 28,589 మంది విద్యార్థులు పరీక్షలు రాయనుండగా, 24 సిట్టింగ్ స్క్వార్డులు, 9 ఫ్లయింగ్ స్క్వాడ్‌లతో పరీక్షను పర్యవేక్షించనున్నారు. పరీక్షల్లో సమస్యలు ఎదురైతే ఫిర్యాదుకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. విద్యార్థులు గంట ముందు పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు.
News March 16, 2026
నేడు విజయవాడలో ప్రభుత్వ ఇఫ్తార్ విందు.. రానున్న సీఎం

విజయవాడలోని ఏ-ప్లస్ కన్వెన్షన్ హాల్‌లో సోమవారం సాయంత్రం రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో రంజాన్ ఇఫ్తార్ విందు జరగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. సాయంత్రం 5:45 నుంచి 7 గంటల వరకు ఈ విందు కొనసాగుతుందని అధికారులు తెలిపారు. ఉపవాస దీక్షల అనంతరం ప్రభుత్వ ప్రతినిధులు, ముస్లిం మత పెద్దలు కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి ఇఫ్తార్ విందులో పాల్గొంటారు.
News March 16, 2026
నేటి నుంచి పశువులకు గాలికుంటు వ్యాధి టీకాలు

జాతీయ గాలికుంటు వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం నేటి నుంచి ఏప్రిల్ 29 వరకు కొనసాగుతుందని పశుసంవర్థక శాఖ జేడీ ప్రేమ్‌చంద్ తెలిపారు. అనంతపురం జిల్లా వ్యాప్తంగా పశువులకు ఉచితంగా టీకాలు వేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. జిల్లాకు 3.20 లక్షల మందు డోసులు సరఫరా అయ్యాయని, ప్రతి గ్రామంలోని పశువులకు ముందస్తుగా టీకాలు వేయాలని సిబ్బందిని ఆదేశించారు. రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు.


