News March 15, 2025

ఇబ్రహంపట్నంలో దారుణ హత్య.. నిందితులు అరెస్ట్

image

ఇబ్రహంపట్నం ఫెర్రీలో శనివారం యువకుడు దారుణ హత్య ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హతుడు కంచికచర్ల చెందిన వ్యక్తిగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం విజయవాడ GGHకు తరలించారు. నిందితులను అదుపులోకి తీసునన్నమన్నారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.  

Similar News

News September 16, 2025

HYD: 24 గంటలు గడిచినా కనిపించనిజాడ

image

భారీ వర్షానికి వరద పోటెత్తడంతో ఆదివారం రాత్రి నాలాలో గల్లంతైన మాన్గార్ బస్తీకి చెందిన అర్జున్, రామా జాడ ఇప్పటివరకు లభించలేదు. ఆదివారం రాత్రి నుంచి DRF, GHMC రెస్క్యూ టీమ్‌లు తీవ్రంగా గాలిస్తున్నాయి. మూసీ నదిలోనూ ముమ్మరంగా గాలింపు ప్రక్రియ కొనసాగుతోంది. వారిద్దరు నాలాలో కొట్టుకొని పోవడంతో అఫ్జల్ సాగర్‌ ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

News September 16, 2025

ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా నిర్వహించాలి: జేసీ

image

ఖరీఫ్ సీజన్ ధాన్యం కొనుగోలు ప్రక్రియను సజావుగా నిర్వహించడానికి అధికారులు సిద్ధంగా ఉండాలని అంబేడ్కర్ కోనసీమ జిల్లా జాయింట్ కలెక్టర్ నిశాంతి సూచించారు. సోమవారం జిల్లా కలెక్టరేట్‌లో ధాన్యం కొనుగోలుపై ఆమె సమీక్ష నిర్వహించారు. జిల్లాలో 1,56,505 ఎకరాల్లో వరి సాగైందని, 4.34 లక్షల టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేశారు. కొనుగోలు ప్రక్రియపై ఆమె అధికారులకు సూచనలు ఇచ్చారు.

News September 16, 2025

ఒక్కసారిగా ‘టమాటా’ విలన్ అయ్యాడు!

image

వారం క్రితం కిలో రూ.40 వరకు పలికిన టమాటా ధరలు అమాంతం పడిపోయాయి. పత్తికొండ మార్కెట్‌లో కిలో రూ.5-8, 20 కిలోల గంప కేవలం రూ.150 మాత్రమే పలుకుతుండటంతో రవాణా ఖర్చులకే ఆ డబ్బు సరిపోతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పత్తికొండ డివిజన్ పరిధిలో 5,500 హెక్టార్లలో పంట సాగు కాగా దిగుబడులు భారీగా వస్తున్నాయి. ధరలు మాత్రం లేకపోవడంతో కొందరు మార్కెట్‌లో, మరికొందరు రోడ్డు గట్టున టమాటాలను వదిలి వెళ్తున్నారు.