News March 15, 2025

HYD: మారనున్న యూనివర్సిటీ పేరు.. హిస్టరీ ఇదే!

image

నాంపల్లిలోని పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ పేరు మార్పుపై నేడు సభలో బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. వర్సిటీకి సురవరం ప్రతాపరెడ్డి పేరు పెట్టనున్నట్లు సమాచారం. కాగా సరిగ్గా నలభై ఏళ్ల క్రితం 1985లో తెలుగు యూనివర్సిటీని NTR ప్రారంభించారు. దీనికే 1998లో పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీగా నామకరణం చేశారు.

Similar News

News March 7, 2026

అనకాపల్లి: ఇంటర్ పరీక్షకు 429 మంది గైర్హాజరు

image

అనకాపల్లి జిల్లాలో శనివారం జరిగిన ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షకు 429 మంది విద్యార్థులు గైర్హాజరు అయినట్లు డీఐఈవో వినోద్ బాబు తెలిపారు. మొత్తం 4,378 మంది విద్యార్థులు హాజరు కావలసి ఉండగా, 3,949 మంది విద్యార్థులు హాజరైనట్లు పేర్కొన్నారు. జిల్లాలో ఇంటర్ పరీక్షలు ఎటువంటి మాస్ కాపీయింగ్‌కు అవకాశం లేకుండా పకడ్బందీగా నిర్వహిస్తున్నామన్నారు.

News March 7, 2026

కుటుంబ సర్వే రెండు రోజుల్లో పూర్తి కావాలి: VZM కలెక్టర్

image

ఏకీకృత కుటుంబ సర్వే రెండు రోజుల్లో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి తెలిపారు. శనివారం మండల వారీగా కలెక్టర్ టీసీ ద్వారా సమీక్షించారు. ఎక్కువ పెండింగ్ ఉన్న మండలాల అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు రోజుల్లో పూర్తి చేయని వారిపై చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. జిల్లా పరిషత్ సీఈవో పర్యవేక్షించాలని గంట గంటకు రిపోర్ట్ సమర్పించాలని జి.ఎస్.డబ్ల్యు కో ఆర్డినేటర్‌ను ఆదేశించారు.

News March 7, 2026

KMR: మాదకద్రవ్యాల వినియోగం నివారణపై జిల్లా స్థాయి అవగాహన

image

కామారెడ్డి జిల్లా ఎస్పీ కార్యాలయంలో పాఠశాల విద్యాశాఖ-ప్రహరీ క్లబ్స్ ఆధ్వర్యంలో సోమవారం మాదకద్రవ్యాల వినియోగం నివారణపై జిల్లా స్థాయి అవగాహన కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి రాజు తెలిపారు. ఎంపిక చేసిన 36 పాఠశాలల నుంచి ఉపాధ్యాయులు 7, 9వ తరగతులకు చెందిన ఇద్దరు విద్యార్థులు పాల్గొనాలన్నారు. శ్రీనివాస్, కృష్ణ, అమరేందర్ రిసోర్స్ పర్సన్స్ గా వ్యవహరించనున్నట్లు ఆయన తెలిపారు.