News March 15, 2025

సిద్దిపేట: అలర్ట్.. పిల్లలపై కన్నేసి ఉంచండి

image

సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా వేసవి తాపం నేపథ్యంలో నేటి నుంచి ఒంటిపూట బడులు ప్రారంభం కానున్నాయి. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు తరగతులు ఉంటాయి. ఒంటిపూట బడులు అంటే పిల్లలకు సరదా.. చెరువుల్లో, నీటి వనరుల వద్దకు వెళ్తుంటారు. చిన్నారులు నీట మునిగి మృత్యువాత పడిన ఘటనలు ఎన్నో జరిగాయి. చెరువులు, కుంటలు, బావులు నీటితో నిండి ఉన్నాయి. పిల్లల మీద పెద్దలు ఓ కన్నేసి ఉంచండి. SHARE IT..

Similar News

News March 7, 2026

రాజమండ్రి: ఎస్సీ కమిషన్ ఛైర్మన్‌కు స్పల్ప అస్వస్థత

image

రాజమండ్రి పర్యటనలో ఉన్న జాతీయ ఎస్సీ కమిషన్ ఛైర్మన్ కిషోర్ మక్వానా శనివారం స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. గుండెలో నొప్పి రావడంతో అప్రమత్తమైన అధికారులు ఆయనను చికిత్స కోసం స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ప్రాథమిక చికిత్స అందించి ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు సమాచారం. అధికారులు పర్యటన వివరాలను సమీక్షిస్తున్నారు.

News March 7, 2026

కామారెడ్డి: పరీక్ష రాసి.. అదృశ్యమై.. శవమై..!

image

కామారెడ్డి (D) బిచ్కుందలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. స్థానిక మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్‌లో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్న ముజాహిద్ గురువారం వార్షిక పరీక్ష రాశాడు. పరీక్ష ముగిసిన అనంతరం అతడు అదృశ్యమయ్యాడు. దీంతో ప్రిన్సిపల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంతలోనే ముజాహిద్ శనివారం పెద్దదడిగి గ్రామం సమీపంలోని కౌలాస్ నాలా కాలువలో శవమై కనిపించాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News March 7, 2026

భూపాలపల్లి జిల్లా వాసికి గద్దర్ అవార్డు

image

తెలంగాణ గద్దర్ అవార్డ్స్-2025 రాష్ట్రం ప్రభుత్వం ప్రకటించింది. ఉత్తమ గేయ రచయితగా భూపాలపల్లి జిల్లా గణపురం మండలానికి చెందిన నందకిశోర్ ఎంపికయ్యారు. ప్రముఖ హీరోలు ధనుశ్, నాగార్జున నటించిన కుబేర సినిమాలోని ‘నా కొడుకా’ పాటకు గాను నందకిశో‌ర్‌కు గద్దర్ అవార్డు లభించింది. జిల్లా వాసికి అవార్డు లభించడంతో స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.