News March 15, 2025
రోజూ డ్రింక్స్ తాగే మహిళలకు నోటి క్యాన్సర్ ముప్పు: అధ్యయనం

రోజూ కనీసం ఒక డ్రింక్ తాగే మహిళలకు నోటి క్యాన్సర్ వచ్చే ముప్పు ఐదింతలు ఎక్కువని USలోని ‘యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్’ పరిశోధకుల అధ్యయనంలో తేలింది. ‘డ్రింక్స్ తాగే యువతుల్లో ధూమ, మద్యపాన అలవాట్లు లేకపోయినా నోటి క్యాన్సర్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. 2020లో ప్రపంచవ్యాప్తంగా 3.55 లక్షలమందికి నోటి క్యాన్సర్ సోకింది. వీరిలో ఎక్కువగా యువతులే ఉండటం ఆందోళనకరం’ అని తమ నివేదికలో వారు తెలిపారు.
Similar News
News March 15, 2025
అప్పటికి పవన్ ఇంకా పుట్టలేదేమో?: డీఎంకే

తమిళ సినిమాలను హిందీలో ఎందుకు డబ్బింగ్ చేస్తున్నారంటూ ప్రశ్నించిన AP Dy.CM పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు DMK కౌంటరిచ్చింది. త్రిభాషా విధానాన్ని పవన్ తప్పుగా అర్థం చేసుకున్నారని ఆ పార్టీ నేత సయీద్ హఫీజుల్లా అన్నారు. ‘కేంద్రం మాపై బలవంతంగా హిందీ భాషను రుద్దుతోంది. TN ద్విభాషా విధానాన్ని పాటిస్తోంది, దీనిపై బిల్లు చేసి 1968లోనే మా అసెంబ్లీ పాస్ చేసింది. అప్పటికి పవన్ ఇంకా పుట్టలేదేమో’ అని సెటైర్ వేశారు.
News March 15, 2025
కొడుతూ పోలీసులు టార్చర్ చేస్తున్నారు: నటి

కస్టడీలో తనపై భౌతిక దాడి జరుగుతోందని నటి రన్యారావు ఆరోపించారు. పోలీసులు పలుమార్లు తనను కొట్టారని, ఆహారం ఇవ్వడం లేదని ఆమె జైలు ఉన్నతాధికారికి ఫిర్యాదు చేశారు. తెల్ల కాగితాలపై సైన్ చేయాల్సిందిగా DRI అధికారులు ఒత్తిడి చేస్తున్నారని ఆరోపించారు. తనకేమీ తెలియదని, తప్పుడు కేసులో ఇరికించారని అన్నారు. బంగారం స్మగ్లింగ్ చేస్తూ ఆమె అరెస్టవ్వడం తెలిసిందే. CBI, ED సైతం ఈ కేసును దర్యాప్తు చేస్తున్నాయి.
News March 15, 2025
భద్రాద్రిలో 64 మంది మావోల లొంగుబాటు

TG: భద్రాద్రి జిల్లాలో భారీ సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోయారు. మల్టీజోన్-1 ఐజీ చంద్రశేఖర్ రెడ్డి, ఎస్పీ రోహిత్ రాజు ఎదుట 64 మంది నక్సల్స్ సరెండర్ అయ్యారు. ఈ సందర్భంగా ఐజీ మీడియాతో మాట్లాడారు. ‘పోలీసులకు, సీఆర్పీఎఫ్ అధికారులకు ఇవాళ ఓ మంచి రోజు. మావోయిస్టు పార్టీని, సిద్ధాంతాలను వీడి భారీ సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోవడం శుభపరిణామం’ అని ఆయన పేర్కొన్నారు.