News March 15, 2025
ధన్వాడ: చిరుత దాడిలో దూడ మృతి.!

చిరుత దాడిలో లేగదూడ మృతి చెందిన ఘటన NRPT జిల్లా ధన్వాడ మండలంలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలానికి చెందిన రైతు చెట్టుకింది కథలప్ప పొలంలో శుక్రవారం రాత్రి లేగదూడపై చిరుత దాడి చేయడంతో మృతి చెందింది. సుమారు రూ.60 వేలు నష్టం వాటిలినట్లు రైతు తెలిపారు. శనివారం ఉదయం ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మల్లేశ్ ఘటన ప్రదేశాన్ని పరిశీలించి చిరుత దాడి జరిగినట్లు నిర్ధారించారు.
Similar News
News January 13, 2026
మెదక్ జిల్లాలో మహిళలదే హవా !

మెదక్ జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలో మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. మహిళా ఓటర్లు 45,168 మంది ఉండగా, పురుష ఓటర్లు 42,015 మంది ఉన్నారు. మెదక్ మున్సిపాలిటీలో 19,406, తూప్రాన్ 10,302, నర్సాపూర్ 8,656, రామాయంపేట 6,804 మహిళా ఓటర్లు ఉండగా, మెదక్ 17,548, తూప్రాన్ 9,957, నర్సాపూర్ 8,219, రామాయంపేట 6,291 మంది పురుష ఓటర్లు ఉన్నారు. మెదక్, నర్సాపూర్‌లో ఒక్కొక్క ఓటరు ఇతరులు ఉన్నారు.
News January 13, 2026
ఖమ్మం: సీపీఎం నేత హత్య.. వీరికి లై డిటెక్టర్ పరీక్ష

సీపీఎం నేత సామినేని హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కోర్టు అనుమతితో పోలీసులు ఆరుగురు నిందితులకు బెంగళూరులోని ఫోరెన్సిక్ ల్యాబ్‌లో మంగళవారం పాలీగ్రాఫ్ (లై డిటెక్టర్) పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ జాబితాలో బోర్రా ప్రసాద్‌రావు, కంచుమర్తి రామకృష్ణ, కాండ్ర పిచ్చయ్య, మద్దినేని నాగేశ్వరరావు, కొత్తపల్లి వెంకటేశ్వర్లు, గుగ్గిళ్ల వీరభద్రం ఉన్నారు. కొందరు అనుమానితులు పరీక్షకు నిరాకరించినట్లు సమాచారం.
News January 13, 2026
నిర్మల్: బల్దియాల్లో మహిళా ఓటర్లే అధికం

నిర్మల్, ఖానాపూర్, భైంసా మున్సిపల్ పరిధిలో తుది ఓటరు జాబితా విడుదలైంది. దింతో ఈ మూడు మున్సిపాల్టీల్లో మహిళ ఓటర్లే అధికంగా ఉన్నారు. భైంసాలో 26 వార్డుల్లో 25,623, నిర్మల్ 42 వార్డుల్లో 50,824, ఖానాపూర్‌లో 9,168 మంది మహిళ ఓటర్లు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఆయా మున్సిపాల్టీ పరిధిలో ఇక రిజర్వేషన్ల ఖరారు కోసం బరిలో నిలిచే ఆశవహులైన మహిళలు కూడా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.


