News March 15, 2025
VKB: నేటి నుంచి ఒంటి పూట బడులు ప్రారంభం

వికారాబాద్ జిల్లాలో నేటి నుంచి ఏప్రిల్ 23 వరకు ఒంటి పూట బడులు ప్రారంభమవుతాయని జిల్లా విద్యాధికారి రేణుకాదేవి తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 176 ఉన్నత,18 కేజీబివి, మోడల్ 9, యూపీఎస్లు114, ప్రాథమిక 770 పాఠశాలలు ఉండగా అందులో 1,22,556 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారని చెప్పారు. అలాగే ఈనెల 21 నుంచి పదో తరగతి వార్షిక పరీక్షలు జరుగుతాయన్నారు.
Similar News
News March 15, 2025
ఎన్నికల కోసమే డీఎంకే హిందీ డ్రామా: కిషన్ రెడ్డి

TG: తమిళనాడులో ఎన్నికల సమయం దగ్గర పడుతోందని, అందుకే డీఎంకే పార్టీ ప్రజలను రెచ్చగొట్టి అధికారంలోకి రావాలని చూస్తోందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఫైరయ్యారు. త్రిభాషా పాలసీ కొత్తదేం కాదని, దేశంలో ఎక్కడా హిందీ భాషను రుద్దడం లేదని స్పష్టం చేశారు. తమిళ భాష అభివృద్ధికి స్టాలిన్ ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. డీలిమిటేషన్‌పైనా డీఎంకే తప్పుడు ప్రచారం చేస్తోందని విమర్శించారు.
News March 15, 2025
దుర్గాప్రసాద్ ఫ్యామిలీకి అండగా ఉంటాం: పవన్ కళ్యాణ్

అమలాపురం నియోజకవర్గం ఈదరపల్లికి చెందిన జన సైనికుడు అడపా దుర్గాప్రసాద్ ఆత్మకు శాంతి చేకూరాలని పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు. ‘జనసేన సభ నుంచి వెళ్తూ దుర్గాప్రసాద్ చనిపోయారని తెలిసి చింతిస్తున్నా. అతని కుటుంబానికి జనసేన అన్ని విధాలా అండగా ఉంటుంది’ అని పవన్ అన్నారు. పిఠాపురంలో నిన్న దుర్గాప్రసాద్‌కు కళ్లు తిరగ్గా.. బస్సులో కూర్చోపెట్టారు. ఇంటికి వచ్చాక గుండెపోటుతో చనిపోయారని స్థానికులు తెలిపారు.
News March 15, 2025
నిజామాబాద్: ఆర్టీసీ కార్గో ద్వారా ఇంటికే రాములోరి తలంబ్రాలు

నిజామాబాద్ ఆర్టీసీ కార్గో ద్వారా ఇంటికే భద్రాచలం శ్రీసీతారాముల కల్యాణ తలంబ్రాలను అందజేయనున్నట్లు ఏటీఎం శనివారం తెలిపారు. ఏప్రిల్ 6న శ్రీరామ నవమి సందర్భంగా స్వామివారికి వినియోగించిన ముత్యాలు, తలంబ్రాలు మార్చి 14 నుంచి రూ.151 చెల్లించి బుక్ చేసుకున్న వారికి కార్గో విభాగం హోమ్ డెలివరీ చేస్తుందని వివరించారు. మరిన్ని వివరాలకు ఉమ్మడి జిల్లాలోని బస్ డిపోలను సంప్రదించాలని కోరారు.