News March 15, 2025
రంప : పడిపోయిన టమాటా ధర

ఆరుగాలాలు కష్టపడి పంట పండించిన రైతుకు తన కష్టానికి తగిన మద్దతు ధర కూడా రాని పరిస్థితి నేడు నెలకొంది. అల్లూరి జిల్లాలో టమాటా రేటు బాగా పడిపోయింది. రంపచోడవరం పరిసర గ్రామాల్లో శనివారం హోల్ సేల్ మార్కెట్లో 10 కిలోలు టమాటా రూ. 100 పలికింది. రిటైల్ గా రూ.150 మాత్రమే పలికింది. ఈ సీజన్ దిగుబడి పెరిగి ఒకే సారి పంట మార్కెట్టుకు రావడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని వ్యాపారులు అంటున్నారు.
Similar News
News September 17, 2025
‘నా మిత్రుడు ట్రంప్’కు ధన్యవాదాలు: PM మోదీ

ఉక్రెయిన్ వివాదానికి శాంతియుత పరిష్కారం కోసం అమెరికా చేసే చొరవలకు మద్దతు ఇస్తున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. ‘నా 75వ పుట్టినరోజు సందర్భంగా ఫోన్ చేసి శుభాకాంక్షలు చెప్పిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌నకు ధన్యవాదాలు. మీలాగే, నేను కూడా భారతదేశం-అమెరికా సమగ్ర, ప్రపంచ భాగస్వామ్యాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లడానికి పూర్తిగా కట్టుబడి ఉన్నాను’ అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.
News September 17, 2025
ఆరోగ్య సంరక్షణకు ప్రత్యేక వైద్య శిబిరాలు: DMHO

మహిళల ఆరోగ్య సంరక్షణకు జిల్లాలో ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు బాపట్ల DMHO విజయమ్మ తెలిపారు. మంగళవారం వైద్య శిబిరాలకు సంబంధించి బాపట్లలో సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈనెల 17 నుంచి అక్టోబర్ 2 వరకు ఆరోగ్యవంతమైన మహిళ.. శక్తివంతమైన కుటుంబం నినాదంతో జిల్లాలోని PHC, UPHCలు, సామాజిక ఆరోగ్య కేంద్రాలు, వైద్యశాలల్లో శిబిరాలు నిర్వహిస్తామన్నారు. మహిళలు ఈ శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.
News September 17, 2025
త్వరలో మహిళా పాలసీ ప్రకటిస్తాం: మంత్రులు

TG: త్వరలో మహిళా పాలసీ ప్రకటిస్తామని మంత్రులు సురేఖ, సీతక్క వెల్లడించారు. ‘కుటుంబ బాధ్యతలు, వృత్తి బాధ్యతల్లో మహిళలు నిత్యం ఒత్తిడులకు గురవుతున్నారు. ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం కూడా చూసుకోవాలి. మహిళలు ఎదుర్కొంటున్న సవాళ్లపై ఈనెల 22న రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తాం. మహిళల సూచనలతో కొత్త మహిళా పాలసీని తీసుకొస్తాం’ అని సెక్రటేరియట్ మహిళా ఉద్యోగుల సంక్షేమ సంఘం లోగో ఆవిష్కరణ కార్యక్రమంలో పేర్కొన్నారు.