News March 15, 2025

మెదక్: యువకుడు ఊరేసుకుని ఆత్మహత్య

image

యువకుడు ఊరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మెదక్ పట్టణం బారా ఇమాంలో శనివారం చోటు చేసుకుంది. పోలీసుల వివరాలు.. సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్‌కు చెందిన అరవింద్ (26) ఫతేనగర్‌లో ఉంటూ ఆర్టీసీలో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. మెదక్ పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్ట్ మార్టం నిమిత్తం మెదక్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Similar News

News September 16, 2025

KNR: శాతవాహన డిగ్రీ ఇన్స్టంట్ ఎగ్జామ్ రేపే

image

డిగ్రీ ఆఖరు సంవత్సరంలో ఒక సబ్జెక్టు ఫెయిలైన విద్యార్థుల కోసం ఇన్స్టంట్ పరీక్ష SEP 17న (రేపు) ఉదయం, మధ్యాహ్నం జరుగుతాయని పరీక్షల నియంత్రణ అధికారి డి. సురేష్ కుమార్ తెలిపారు. 5వ సెమిస్టర్ ఎగ్జామ్ ఉ.9 గం.ల నుంచి మ.12 గం.ల వరకు ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, వివేకానంద డిగ్రీ కళాశాలలో జరుగుతాయని, 6వ సెమిస్టర్ ఎగ్జామ్ మ.2 గం.ల నుంచి సా.5 గం.ల వరకు శ్రీ చైతన్య డిగ్రీ కళాశాలలో జరుగుతాయని చెప్పారు.

News September 16, 2025

నెల్లూరు: ధాన్యం కొనుగోలు కేంద్రాలు లేక రైతుల ఇబ్బందులు!

image

జిల్లాలో 5 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. కోతలు మొదలైపోయినా ధాన్యం కొనుగోలు కేంద్రాలు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. మద్దతు ధర పుట్టి రూ.20,187 ఉండగా మిల్లర్లు రూ.13–15 వేలకే కొనుగోలు చేస్తున్నారు. వర్షాలు పంటను దెబ్బతీయగా ధరలు పడిపోతాయనే ఆందోళన రైతుల్లో ఉంది. గతంలో పుట్టి రూ.24 వేలు ఉండగా, ఇప్పుడు దళారుల చేతిలో దోపిడీకి గురవుతున్నామని రైతులు వాపోతున్నారు.

News September 16, 2025

ప్రజారోగ్యాన్ని వ్యాపారం చేయొద్దు: విడదల రజిని

image

ప్రభుత్వ ఆసుపత్రుల ప్రైవేటీకరణపై మాజీ మంత్రి విడదల రజిని తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యం పేరుతో ప్రజారోగ్యాన్ని వ్యాపారం చేయొద్దని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌కు లేఖ రాశారు. ఈ విధానం పేదలపై ఆర్థిక భారం మోపుతుందని, నాణ్యమైన వైద్యం అందకుండా చేస్తుందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల నిర్వహణ పూర్తిగా ప్రభుత్వ బాధ్యత అని ఆమె స్పష్టం చేశారు.