News March 15, 2025

‘రాబిన్‌హుడ్’లో డేవిడ్ వార్నర్ లుక్ చూశారా!

image

నితిన్, శ్రీలీల జంటగా తెరకెక్కిన ‘రాబిన్‌హుడ్’ సినిమా ఈ నెల 28న విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ప్రత్యేక పాత్ర పోషించారు. ఆయన ఫస్ట్ లుక్‌ను మైత్రీ మూవీ మేకర్స్ విడుదల చేశారు ‘బౌండరీ నుంచి బాక్సాఫీస్‌కు వస్తున్న వార్నర్‌కు భారత సినిమా పరిశ్రమలోకి స్వాగతం’ అన్న ట్యాగ్‌లైన్‌ను పోస్టర్‌పై జత చేసింది. వార్నర్ లుక్ ఎలా ఉంది? కామెంట్ చేయండి.

Similar News

News March 15, 2025

20 ఏళ్ల తర్వాత మళ్లీ జహీర్ ఖాన్‌కు ‘ఐ లవ్ యూ’

image

ఎప్పుడో 20 ఏళ్ల క్రితం భారత పేస్ బౌలర్ జహీర్ ఖాన్‌కు లవ్ ప్రపోజ్ చేసిన యువతి మరోసారి వార్తల్లోకెక్కారు. లక్నో జట్టు మెంటార్‌గా ఉన్న జహీర్‌కు ఓ హోటల్లో మరోసారి అదే రీతిలో ప్రపోజ్ చేశారు. ‘జహీర్ ఐ లవ్ యూ’ అని పోస్టర్ ప్రదర్శించారు. ఈ ఫొటోను LSG షేర్ చేసింది. కాగా 2005లో టీవీఎస్ కప్ సిరీస్‌లో భాగంగా భారత్-పాకిస్థాన్ మ్యాచ్ సందర్భంగా ఈ యువతి లవ్ ప్రపోజ్ చేసి వైరల్ అయ్యారు.

News March 15, 2025

ఆస్ట్రేలియాలో BGT ఆడే అవకాశాలు తక్కువే: కోహ్లీ

image

రిటైర్మెంట్ తర్వాత ప్రపంచాన్ని చుట్టేస్తానని టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ తెలిపారు. ప్రస్తుతం రిటైరయ్యే ఆలోచన లేదన్నారు. కానీ మరోసారి ఆస్ట్రేలియాలో బీజీటీ ఆడే అవకాశాలు తక్కువేనని పేర్కొన్నారు. కాగా 2027-28లో ఆస్ట్రేలియాలో బీజీటీ జరగనుంది. ఆలోగా విరాట్ టెస్టులకు రిటైర్మెంట్ పలికే ఛాన్స్ ఉంది. ఇప్పటికే టీ20లకు స్వస్తి పలికిన విషయం తెలిసిందే.

News March 15, 2025

ఇవాళ అత్యధికంగా 42.4 డిగ్రీల ఉష్ణోగ్రత

image

తెలుగు రాష్ట్రాల్లో భానుడు భగ్గుమంటున్నాడు. ఇవాళ తెలంగాణలో అత్యధికంగా కొమురం భీం జిల్లా ఆసిఫాబాద్ పట్టణంలో 42.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. హైదరాబాద్‌లో 39.6 డిగ్రీల టెంపరేచర్ రికార్డైంది. అటు ఏపీలో అత్యధికంగా నంద్యాల జిల్లా గోస్పాడు, కర్నూలు జిల్లా ఉలిందకొండలో 41.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మరో 5 రోజుల పాటు వడగాలులు కొనసాగుతాయని వాతావరణశాఖ తెలిపింది.

error: Content is protected !!