News March 15, 2025
గోదావరిఖని: ఆటో ట్రాలీ బోల్తా.. పలువురికి గాయాలు

ఎన్టీపీసీ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆర్ఎఫ్ సీఎఫ్ టౌన్ షిప్‌లో గెస్ట్ హౌస్ మూల మలుపు వద్ద శనివారం ట్రాలీ ఆటో అతివేగంగా నడపడంతో అదుపుతప్పి ఆటో బోల్తా పడింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న పలువురికి గాయాలయ్యాయి. గాయపడిన బాధితులను 108 వాహనంలో గోదావరిఖని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News March 16, 2026
NZB: ఇంటర్ అమ్మాయిలకు అద్భుత అవకాశం

ఉమ్మడి నిజామాబాదు జిల్లాలోని 71 కేజీబీవీ (KGBV) పాఠశాలల్లో ఇంటర్మీడియట్ ప్రవేశాలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ నేటి నుంచి ప్రారంభమైంది. పదో తరగతి చదువుతున్న విద్యార్థినులు ఏప్రిల్ 15 వరకు TGRJC CET పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు రుసుము రూ.200గా నిర్ణయించారు. ప్రవేశ పరీక్ష మే 3న నిర్వహించనున్నారు. ఇందులో ఎంపికైన వారికీ జేఈఈ, నీట్, క్లాట్, ఎప్‌సెట్ వంటి ప్రవేశ పరీక్షలకు శిక్షణ ఇస్తారు.
News March 16, 2026
కాకతీయ వర్సిటీలో నేటి నుంచి రసాయన శాస్త్ర సదస్సు

కాకతీయ విశ్వవిద్యాలయం కెమిస్ట్రీ విభాగం ఆధ్వర్యంలో ‘కెమికల్ సైన్సెస్‌లో ప్రస్తుత పరిశోధనలు (CRCS-2026)’ అనే అంశంపై నేటి నుంచి రెండు రోజుల జాతీయ సదస్సు నిర్వహించనున్నారు. వర్సిటీ పరిపాలన భవనంలోని సెనేట్ హాల్‌లో ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమానికి వీసీ ప్రతాప్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఐఐసీటీ (హైదరాబాద్) చీఫ్ సైంటిస్ట్ గంగాగ్నిరావు కీలకోపన్యాసం చేస్తారు.
News March 16, 2026
భద్రాద్రిలో వైభవంగా రామయ్య నిత్య కళ్యాణం

భద్రాద్రి క్షేత్రంలో రామయ్య నిత్య కళ్యాణం వేడుక సోమవారం కనులవిందుగా సాగింది. తెల్లవారుజామున గర్భాలయంలో స్వామివారికి సుప్రభాత సేవ, ఆరాధన తదితర పూజలు నిర్వహించారు. అనంతరం మేళతాళాల నడుమ ఉత్సవ మూర్తులను బేడా మండపానికి ఊరేగింపుగా తీసుకొచ్చారు. అక్కడ విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం అనంతరం శాస్త్రోక్తంగా కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ గావించి నిత్య కళ్యాణం జరిపించారు.


