News March 24, 2024

సీఎం రేవంత్‌కు మందకృష్ణ వార్నింగ్!

image

TG: మాదిగల్ని రెచ్చగొడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ సీఎం రేవంత్‌ను హెచ్చరించారు. ‘మాదిగలు తనకు అండగా ఉన్నారని చెప్పే రేవంత్, ఎస్సీ వర్గీకరణకు మద్దతునిస్తారా? మాదిగలకు న్యాయం చేయమని నేను అడిగితే మాదిగ నేతతో కౌంటర్ ఇప్పించారు. మా జాతిని మోదీ కాళ్ల దగ్గర పెట్టానని విమర్శిస్తున్నారు. వర్గీకరణకు మద్దతిచ్చే ఎవరికైనా మా మద్దతు ఉంటుంది’ అని పేర్కొన్నారు.

Similar News

News January 3, 2025

‘టెట్’ తొలిరోజు ప్రశాంతం

image

TG: రాష్ట్రవ్యాప్తంగా టెట్ పరీక్షలు తొలిరోజైన గురువారం ప్రశాంతంగా ముగిశాయి. 17 జిల్లాల్లో 92 పరీక్షా కేంద్రాల్లో తొలిరోజు పరీక్షకు ఉదయం 72.25శాతం మంది, మధ్యాహ్నం 75.68శాతం మంది హాజరయ్యారు. ఈ నెల 20 వరకు 10 రోజుల పాటు ఈ పరీక్షలు జరగనున్న సంగతి తెలిసిందే. 2, 5, 11, 12, 19, 20 తేదీల్లో పేపర్-2, 8, 9, 10, 18 తేదీల్లో పేపర్-1 పరీక్షని నిర్వహించనున్నారు.

News January 3, 2025

2097 స్కూళ్లలో విద్యార్థులు లేరు!

image

TG: దేశవ్యాప్తంగా విద్యార్థులు లేని పాఠశాలల సంఖ్యలో రాష్ట్రం 3వ స్థానంలో నిలిచింది. ఏకంగా 2097 స్కూళ్లలో పిల్లలే లేరని డీఐఎస్ఎఫ్ఏ విడుదల చేసిన నివేదిక(2023-2024) తేల్చిచెప్పింది. పశ్చిమ బెంగాల్(3254), రాజస్థాన్(2187) తొలి రెండు స్థానాల్లో నిలిచాయి. దేశవ్యాప్తంగా విద్యార్థుల్లేని పాఠశాలలు 12,954 ఉండగా వాటిలో తెలంగాణలోనే 2వేల పైచిలుకు ఉండటం ఆందోళనకరం.

News January 3, 2025

ఈ నెల 28 నుంచి నాగోబా జాతర

image

TG: రాష్ట్రంలో సమ్మక్క-సారక్క జాతర తర్వాత ఆ స్థాయిలో జరిగే కెస్లాపూర్ నాగోబా జాతర ఉత్సవాలు ఈ నెల 28 నుంచి ప్రారంభం కానున్నాయి. దీనికి సంబంధించి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. తాజాగా ఆలయంలో 150మంది ఆదివాసీ యువత రక్తదానం చేసి జాతరకు అంకురార్పణ చేశారు. నాగోబా జాతరకు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుంచి కూడా భారీగా గిరిజనులు తరలిరానున్నారు.