News March 15, 2025
ఉద్యోగాల విషయంలో దేశ చరిత్రలో మాదే రికార్డు: CM

TGPSCని గత BRS ప్రభుత్వం సర్వనాశనం చేసిందని సీఎం రేవంత్ మండిపడ్డారు. ‘డిసెంబర్ 3, 2023 నుంచి ఇప్పటివరకు 57,924 ప్రభుత్వ ఉద్యోగాలిచ్చాం. ఇది దేశ చరిత్రలోనే రికార్డు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఏ రాష్ట్రమూ ఈ ఘనత సాధించలేదు. 2023 జులై నుంచి సెప్టెంబర్ వరకు నిరుద్యోగ రేటు 22.9% ఉంటే 2024 జులై నుంచి సెప్టెంబర్ వరకు 18.1 శాతానికి తగ్గింది. ఇవన్నీ మా కష్టానికి ప్రతిఫలం’ అని అసెంబ్లీలో చెప్పారు.
Similar News
News March 28, 2026
రోజూ పండ్లు తింటే అంతా ఆరోగ్యమే: వైద్యులు

రోజుకొక యాపిల్ తింటే ఆరోగ్యంగా ఉంటారని చెబుతుంటారు. అయితే రోజుకు 2-3 రకాల పండ్లు తినడం మన ఆరోగ్యానికి అవసరమని వైద్యులు సూచిస్తున్నారు. ‘పండ్లలోని పీచు పదార్థం కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. పొటాషియం రక్తపోటును నియంత్రిస్తుంది. పండ్లలోని సహజమైన చక్కెర.. మధుమేహం రాకుండా అడ్డుకుంటుంది. పండ్లు తినకపోతే గుండె జబ్బులు, ఇన్‌ఫ్లమేషన్ వంటి దీర్ఘకాలిక సమస్యలు తప్పవు. అందుకే పండ్లు తినాలి’ అని వివరించారు.
News March 28, 2026
APPLY: 1,060 ప్రభుత్వ ఉద్యోగాలు

సశస్త్ర సీమా బల్(SSB)లో 1,060 ఉద్యోగాలకు APR 20 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందులో 827 కానిస్టేబుల్, 233 హెడ్ కానిస్టేబుల్ పోస్టులున్నాయి. డ్రైవర్, వెటర్నరీ, టైలర్, బార్బర్, కార్పెంటర్, కమ్యూనికేషన్, ఎలక్ట్రీషియన్, స్టీవార్డ్ తదితర విభాగాల్లో ఖాళీలున్నాయి. టెన్త్, సంబంధిత విభాగాల్లో ITI పాసై, వయసు 18-27 ఏళ్లు ఉండాలి. PET/PST, రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు.
వెబ్‌సైట్: https://ssb.gov.in/
News March 28, 2026
మొజ్తబా కూడా చనిపోయి ఉంటారు: ట్రంప్

ఇరాన్ అగ్ర నాయకులందరినీ హతమార్చామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెల్లడించారు. నూతన సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ కూడా మరణించడం లేదా తీవ్రంగా గాయపడి ఉంటారని పేర్కొన్నారు. ఇటీవల కాలంలో ఆయన బహిరంగంగా కనిపించలేదని, ప్రకటనలూ వెలువడలేదని గుర్తు చేశారు. ఇరాన్ మిలిటరీ వ్యవస్థ పూర్తిగా ధ్వంసమైందని చెప్పారు. ఇవి తప్ప మిగతా విషయాల్లో వారు బాగానే ఉన్నారని భావిస్తున్నట్లు సెటైర్ వేశారు.


