News March 15, 2025
ఫాస్ట్ ఫుడ్ తింటున్నారా? తస్మాత్ జాగ్రత్త

వీకెండ్ వచ్చిందంటే చాలు బయటి ఫాస్ట్ ఫుడ్ తినడం నేడు సర్వసాధారణంగా మారిపోయింది. అలా తినేవారు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్‌లోని ఏఐఎన్‌యూ వైద్యులు హెచ్చరిస్తున్నారు. ‘ఫాస్ట్ ఫుడ్ కారణంగా యువతలో మూత్రనాళాల ఇన్ఫెక్షన్లు బాగా ఎక్కువ అవుతున్నాయి. క్రియాటినిన్ స్థాయులు పెరుగుతున్నాయి. చాలామంది ఇదే సమస్యలతో ఆస్పత్రులకు వస్తున్నారు. నిర్లక్ష్యం చేస్తే ఇది కిడ్నీలకు ప్రమాదం’ అని వారు పేర్కొన్నారు.
Similar News
News March 6, 2026
లిక్కర్ స్కామ్.. రూ.441 కోట్ల ఆస్తులు అటాచ్

AP: లిక్కర్ స్కామ్ కేసులో కీలక నిందితులు కసిరెడ్డి, వాసుదేవ రెడ్డి, చాణక్యకు చెందిన రూ.441 కోట్ల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. 2019 తర్వాత లిక్కర్ పాలసీలో మార్పులు చేసి పాత మద్యం బ్రాండ్లను మార్కెట్ నుంచి తొలగించారని పేర్కొంది. ఫేవర్ బ్రాండ్లకు ప్రత్యేక ఆర్డర్లు ఇచ్చినట్లు విచారణలో తేలిందని వెల్లడించింది. కమీషన్ ఇవ్వని కంపెనీలకు సప్లై ఆర్డర్లు నిలిపివేశారని వివరించింది.
News March 6, 2026
ICC టోర్నీల్లో 15వ సారి ఫైనల్‌కు.. గెలుస్తుందా?

టీమ్ఇండియా టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు చేరింది. 1983లో కపిల్ దేవ్ ప్రారంభించిన విజయ పరంపరను గంగూలీ, ధోనీ, కోహ్లీ, రోహిత్ శర్మల అడుగుజాడల్లో సూర్య బృందం దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్తోంది. ఐసీసీ టోర్నీల చరిత్రలో భారత్ ఫైనల్‌కు చేరడం ఇది 15వ సారి. WC, CT, WTCలలో మన జట్టు నిలకడైన ప్రదర్శనతో దూసుకుపోతోంది. ఎల్లుండి న్యూజిలాండ్‌తో జరగనున్న ఫైనల్ పోరులో భారత్ గెలవాలని ఫ్యాన్స్ ఆకాంక్షిస్తున్నారు.
News March 6, 2026
యుద్ధం ఆపేందుకు ఇరాన్ లీడర్‌తో కేఏ పాల్ చర్చలు

మిడిల్ ఈస్ట్ యుద్ధాన్ని ఆపేందుకు ప్రజాశాంతి పార్టీ చీఫ్ KA పాల్ ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇండియాలోని ఇరాన్ సుప్రీం లీడర్ ప్రత్యేక ప్రతినిధి మజీద్‌తో చర్చలు జరిపినట్లు ట్వీట్ చేశారు. ఆయన సానుకూలంగా స్పందించి కాల్పుల విరమణకు ఇరాన్ కట్టుబడి ఉందని చెప్పినట్లు పేర్కొన్నారు. ఇజ్రాయెల్, US కూడా శాంతి చర్చల కోసం 3 రోజులు సీజ్‌ఫైర్ ప్రకటించాలని కోరారు. శాంతి విషయంలో తనకు 44 ఏళ్ల అనుభవం ఉందన్నారు.


