News March 15, 2025

NZB: రైల్వే స్టేషన్‌లో చిన్నారి MISSING

image

నిజామాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఓ చిన్నారి అదృశ్యమైనట్లు 1 టౌన్ SHO రఘుపతి శనివారం తెలిపారు. శుక్రవారం కుటుంబ సభ్యులతో రైల్వే స్టేషన్‌కు వచ్చిన చిన్నారి స్టేషన్‌లో కనపడకుండా పోయింది. దీంతో కుటుంబ సభ్యులు చుట్టుపక్కల ప్రాంతంలో వెతికిన చిన్నారి జాడ దొరకలేదు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఎవరైనా గుర్తుపడితే పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు.

Similar News

News December 28, 2025

NZB: చెట్టుకు ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య

image

నిజామాబాద్ నగరంలోని గూపన్ పల్లి శివారులో చెట్టుకు ఉరేసుకుని ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నట్లు రూరల్ టౌన్ ఎస్‌హెచ్ఓ శ్రీనివాస్ తెలిపారు. గ్రామానికి చెందిన చింతల ఏడ్డి రాజన్న(50) గత కొన్నిరోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ శనివారం గ్రామ శివారులోని చెట్టుకు ఉరేసుకున్నట్లు చెప్పారు. మృతుని భార్య పదేళ్ల క్రితం మృతి చెందింది. ఆయనకు ముగ్గురు కూతుర్లు ఉన్నారు.

News December 28, 2025

NZB: రోడ్డు ప్రమాదాల నివారణకు విస్తృత స్థాయిలో అవగాహన

image

రోడ్డు ప్రమాదాల నియంత్రణ కోసం విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను విధిగా పాటిస్తే, ప్రమాదాలకు ఆస్కారం ఉండదని అన్నారు. కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్‌లో కలెక్టర్ అధ్యక్షతన రోడ్డు భద్రతా కమిటీ సమావేశం జరిగింది. నేషనల్ హైవే అథారిటీ, ఆర్అండ్‌బీ, రవాణా శాఖ, ఆర్టీసీ, పంచాయతీ రాజ్, విద్యుత్ అధికారులు పాల్గొన్నారు.

News December 27, 2025

NZB: 129 మందిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు: ఇన్‌ఛార్జ్ CP

image

నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వారం రోజుల్లో 129 డ్రంక్ అండ్ డ్రైవ్‌ కేసులు నమోదైనట్లు ఇన్‌ఛార్జ్ పోలీస్ కమిషనర్ రాజేశ్ చంద్ర తెలిపారు. వీరందరినీ కోర్టులో హాజరు పరిచినట్లు చెప్పారు. న్యాయమూర్తి 129 మందికి రూ.8.80 లక్షల జరిమానా వేసినట్లు పేర్కొన్నారు. అలాగే 10 మందికి వారం రోజుల చొప్పున జైలు శిక్ష విధించారని వెల్లడించారు.