News March 15, 2025

పరీక్షలు ప్రశాంతంగా రాయండి: KMR కలెక్టర్

image

ప్రశాంత వాతావరణంలో విద్యార్థులు పరీక్షలు రాయాలని ఎవరు ఒత్తిడికి లోను కావద్దని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సూచించారు. శనివారం ఆయన పిట్లంలో పర్యటించారు. ముందుగా గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని సందర్శించారు. ఎల్ఆర్ఎస్ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. అనంతరం ZPHSలో పదో తరగతి విద్యార్థులతో మాట్లాడారు. అక్కడే వారితో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు.

Similar News

News March 15, 2025

కొమురవెల్లికి బస్సులు లేక ప్రయాణికుల ఇక్కట్లు!

image

జనగామ బస్టాండ్‌లో కొమురవెల్లికి వెళ్లే భక్తులకు సరిపడా బస్సులు లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గంటల తరబడి పడిగాపులు కాసినా ఒక్క బస్సు కూడా రావడం లేదని వాపోతున్నారు. జాతరకు వెళ్లే భక్తులకు సరైన బస్సు సౌకర్యాలు అందించాలని పలువురు కోరుతున్నారు. అధికారులు పట్టించుకొని ఈ సమస్యను పరిష్కరించాలన్నారు.

News March 15, 2025

గవర్నర్‌ను కలిసిన వివేకా కుమార్తె సునీత

image

AP: మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసుకు సంబంధించి ఆయన కుమార్తె సునీత రాజ్ భవన్‌లో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌ను కలిశారు. తన తండ్రి హత్య కేసు విచారణ వేగవంతం చేయాలని ఆమె కోరారు. ఈ సందర్భంగా హత్య కేసులో కీలక పరిణామాలను ఆయనకు వివరించారు. వివేకా హత్య జరిగి 6 ఏళ్లు అయిందని, న్యాయం కోసం అప్పటి నుంచి పోరాడుతూనే ఉన్నానని ఆమె ఇటీవల వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలోనే గవర్నర్‌ను కలిశారు.

News March 15, 2025

నిజామాబాద్: ఇంటర్ పరీక్షల్లో 364 మంది విద్యార్థులు గైర్హాజరు

image

నిజామాబాద్ జిల్లాలో శనివారం నిర్వహించిన ఇంటర్ రెండవ సంవత్సరం మ్యాథ్స్, జువాలజీ, హిస్టరీ-2 పరీక్షకు మొత్తం 364 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని అధికారులు తెలిపారు. జిల్లాలో మొత్తం 14,472 మంది విద్యార్థులకు 14,108 మంది పరీక్షలకు హాజరయ్యారన్నారు. పరీక్షలు జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా జరిగాయని అధికారులు వివరించారు.

error: Content is protected !!