News March 15, 2025
BREAKING: ఉప్పల్ సమీపంలో రోడ్డుప్రమాదం

డీసీఎం, బైక్ ఢీకొనటంతో ఓ ద్విచక్ర వాహనదారుడు అక్కడికక్కడే మృతి చెందిన ఘటన ఉప్పల్ భగాయత్ పరిధి ఫైర్ పోలీస్ స్టేషన్ ఎదురుగా జరిగింది. ఉప్పల్ నుంచి నాగోల్ వైపు భగాయత్ మీదుగా వెళ్లే మార్గంలో ఓ వ్యక్తి బైక్‌పై ప్రయాణిస్తూ వెళుతుండగా వేగంగా వచ్చిన డీసీఎం ఢీకొట్టినట్లు అక్కడి వారు తెలిపారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు.
Similar News
News March 15, 2025
ప్రకాశం: ఈనెల 19న మెగా జాబ్ మేళా

ఈనెల 19న ఒంగోలులోని శ్రీహర్షిని డిగ్రీ కళాశాలలో సంకల్ప్ మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లుగా జిల్లా కలెక్టర్ అన్సారియా పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఒంగోలు కలెక్టరేట్‌లో శనివారం జాబ్ మేళా ప్రచార గోడపత్రికను కలెక్టర్ ఆవిష్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో 10 నుంచి పీజీ వరకు చదివిన యువత జాబ్ మేళాలో పాల్గొనవచ్చన్నారు.
News March 15, 2025
కొమురవెల్లికి బస్సులు లేక ప్రయాణికుల ఇక్కట్లు!

జనగామ బస్టాండ్‌లో కొమురవెల్లికి వెళ్లే భక్తులకు సరిపడా బస్సులు లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గంటల తరబడి పడిగాపులు కాసినా ఒక్క బస్సు కూడా రావడం లేదని వాపోతున్నారు. జాతరకు వెళ్లే భక్తులకు సరైన బస్సు సౌకర్యాలు అందించాలని పలువురు కోరుతున్నారు. అధికారులు పట్టించుకొని ఈ సమస్యను పరిష్కరించాలన్నారు.
News March 15, 2025
గవర్నర్‌ను కలిసిన వివేకా కుమార్తె సునీత

AP: మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసుకు సంబంధించి ఆయన కుమార్తె సునీత రాజ్ భవన్‌లో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌ను కలిశారు. తన తండ్రి హత్య కేసు విచారణ వేగవంతం చేయాలని ఆమె కోరారు. ఈ సందర్భంగా హత్య కేసులో కీలక పరిణామాలను ఆయనకు వివరించారు. వివేకా హత్య జరిగి 6 ఏళ్లు అయిందని, న్యాయం కోసం అప్పటి నుంచి పోరాడుతూనే ఉన్నానని ఆమె ఇటీవల వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలోనే గవర్నర్‌ను కలిశారు.