News March 15, 2025
భద్రాద్రి: లొంగిపోయిన 64 మంది మావోయిస్టులు

భద్రాద్రి జిల్లా పోలీసుల ఎదుట 64 మంది మావోయిస్టులు సరెండర్ అయ్యారు. ఈ సందర్భంగా పోలీసులకు, సీఆర్పీఎఫ్ అధికారులకు ఓ మంచి రోజు అని మల్టీజోన్ -1 ఐజీ చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. మావోయిస్టు పార్టీని, సిద్ధాంతాలను వీడి ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాకు చెందిన 64 మంది మావోయిస్టులు లొంగిపోయారని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ఎస్పీ రోహిత్ రాజు, ఏఎస్పీ విక్రాంత్, సీఆర్పీఎఫ్ అధికారి రితేష్ ఠాకూర్ పాల్గొన్నారు.
Similar News
News March 16, 2025
హీరో విశ్వక్ సేన్ ఇంట్లో చోరీ

టాలీవుడ్ హీరో విశ్వక్ సేన్ ఇంట్లో దొంగతనం జరిగింది. HYD ఫిలింనగర్లోని విశ్వక్ ఇంట్లో రెండు డైమండ్ రింగులు సహా రూ.2.20 లక్షల విలువైన ఆభరణాలు చోరీకి గురయ్యాయి. దీనిపై విశ్వక్ తండ్రి సి.రాజు ఫిలింనగర్ PSలో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఇంటికి వచ్చి సీసీ ఫుటేజ్ పరిశీలించారు. ఓ గుర్తు తెలియని వ్యక్తి తెల్లవారుజామున 5.50 గంటల సమయంలో ఇంట్లోకి వెళ్లి వాటిని తస్కరించినట్లుగా గుర్తించారు.
News March 16, 2025
అనంతపురం: ‘పదవ తరగతి పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు’

పదవ తరగతి పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని అనంతపురం జిల్లా ఎస్పీ జగదీశ్ పేర్కొన్నారు. విద్యార్థులు ఎలాంటి సెల్ఫోన్లు, స్మార్ట్ వాచ్లు, పర్సులు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను పరీక్ష కేంద్రాల్లోకి తీసుకెళ్లకుండా తనిఖీలు నిర్వహిస్తామన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చెయ్యనున్నట్లు పేర్కొన్నారు. ప్రత్యేక పోలీసు బృందాలతో పెట్రోలింగ్ ముమ్మరం చేస్తామన్నారు.
News March 16, 2025
సీసీటీవీ ఇన్స్టాలేషన్ కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం

సీసీటీవీ ఇన్స్టాలేషన్ కోర్సులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు శ్రీ సత్యసాయి జిల్లా నైపుణ్య అభివృద్ధి అధికారి హరికృష్ణ ఓ ప్రకటనలో తెలిపారు. బుక్కపట్నంలోని డిగ్రీ కళాశాలలో కోర్సులను ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. ఇంటర్, డిగ్రీ, ఐటీఐ చదివిన వారు ఈ కోర్సులు నేర్చుకోవడానికి అర్హులు అన్నారు. ఆసక్తి కలవారు దరఖాస్తులు చేసుకోవాలని, మూడు నెలల శిక్షణానంతరం ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు.