News March 15, 2025
పెద్దపల్లి: నేడు 209 మంది గైర్హాజరు

పెద్దపల్లి జిల్లాలో బుధవారం ఇంటర్మీడియట్ రెండోవ సంవత్సరం పరీక్షలు ప్రశాంతంగా కొనసాగాయని జిల్లా నోడల్ అధికారి కల్పన పేర్కొన్నారు. గణితం B, జీవ శాస్త్రం, చరిత్ర పేపర్లకు పరీక్షలు జరిగాయన్నారు. 3895 విద్యార్థులకు గాను 3647 హాజరయ్యారని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 248 మంది విద్యార్థులు గైర్హాజరు అయ్యారని తెలిపారు. ఈ పరీక్షల్లో జనరల్ 209 మంది, వొకేషనల్ 39మంది విద్యార్థులు హాజరు కాలేదన్నారు.
Similar News
News November 4, 2025
మెట్‌పల్లి: నిజాయితీ చాటుకున్న యువకుడు

మెట్‌పల్లి పట్టణంలోని దుబ్బవాడలో జిల్లా బీసీ విద్యార్థి సంఘం ఉపాధ్యక్షుడు జెట్టి నరేంద్ర తన ఇంటి బయట రోడ్డుపై పడిపోయిన ఫోనును గుర్తించాడు. దానిని తీసి వెంటనే చుట్టుపక్కల వారిని ఫోను ఎవరిదని వివరాలు అడగగా.. ఎవరు తమకు తెలియదని చెప్పారు. దీంతో ఆ ఫోనును స్థానిక పోలీస్ స్టేషన్ లో అందజేసి పోగొట్టుకున్న వారిని గుర్తించి వారికి ఫోన్ అందజేయాలని ఆయన కోరారు. ఎండి ముక్తార్, జెట్టి నరేష్ ఉన్నారు.
News November 4, 2025
మెట్‌పల్లి: మా కష్టం చూసి దేవుడూ కరగడా..?

ఆరుగాలం కష్టం.. అంతా వృథా. MTPL(M) మెట్లచిట్టాపూర్ కొనుగోలు కేంద్రంలో ధాన్యం కుప్పపక్కన నిలబడి, కన్నీరు పెట్టుకున్నఓ మహిళా రైతు ఆవేదన ఎవరికి చెప్పేది? మొన్న తుఫాను, నిన్న మొలకలు. 2 రోజులు ఎండ వచ్చిందని ఆరబెడితే, కుప్ప అడుగుభాగంలోనే ధాన్యం మొలకెత్తింది. ‘నష్టపోయిన మాపై దేవుడికి కూడా చిన్నచూపేనా?’ అంటూ గుండెలు బాదుకుంది. కష్టపడి పండించిన ధాన్యం ఇలా పాడవడం చూసి ఆ అన్నదాత కన్నీరు ఆపడం ఎవరి వశంకాలేదు.
News November 4, 2025
అమరచింతలో 17.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు

వనపర్తి జిల్లాలో గత 24 గంటల్లో అత్యధికంగా అమరచింతలో 17.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. ఘనపూర్ 6.2 గోపాల్ పేట్ 7.2 వనపర్తి 6.2 ఆత్మకూరు 13.6 వీపనగండ్ల 0.8 రేవల్లి 2.8 చిన్నంబాయిలలో 4.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు జిల్లా సీపీఓ తన నివేదికలో పేర్కొన్నారు. జిల్లా ఒకరోజు వర్షపాతం మొత్తం 59.6 మిల్లీమీటర్లు కాగా సగటు 4.2 మిల్లీమీటర్లు నమోదయిందన్నారు.


