News March 15, 2025
జాతరేమో పరకాలలో.. రాజకీయమంతా నర్సంపేటలో..!

గీసుకొండ మండలం కొమ్మాల జాతర పాలన పరంగా పరకాల నియోజకవర్గంలో ఉంటుంది. కానీ ఈ జాతర ప్రభావం రాజకీయంగా నర్సంపేట నియోజకవర్గంలోనే ఎక్కువగా జరుగుతోంది. జాతరకు నెల రోజుల ముందు నుంచే దుగ్గొండి, నర్సంపేట, చెన్నారావుపేట, నల్లబెల్లి మండలాల్లో రాజకీయ పార్టీల నేతలు ప్రభ బండ్లను కడుతారు. ఏటా ఈ ప్రభ బండ్ల విషయంలో నర్సంపేటలో రాజకీయ గొడవలు జరుగుతూనే ఉంటాయి. పోలీసులకు జాతర అగ్ని పరీక్షలా మారుతోంది.
Similar News
News December 27, 2025
ఇంటి వాస్తుకు పంచ భూతాల ప్రాముఖ్యత

వాస్తు శాస్త్రంలో పంచభూతాలైన భూమి, ఆకాశం, వాయువు, అగ్ని, జలం సమతుల్యత చాలా ముఖ్యమని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచిస్తున్నారు. ‘భూమి తత్వం ఇంటికి స్థిరత్వాన్ని, జలం ప్రశాంతతను, అగ్ని ఆరోగ్యం, శక్తిని, వాయువు సంబంధాలను ప్రభావితం చేస్తాయి. ఇంటి మధ్యభాగమైన బ్రహ్మ స్థానం సానుకూలతను నింపుతుంది. ఈ 5 ప్రకృతితో అనుసంధానమై ఉండటం వల్ల ఇంట్లోకి సుఖశాంతులు, ఐశ్వర్యం చేకూరుతాయి’ అని వివరిస్తున్నారు. <<-se>>#Vasthu<<>>
News December 27, 2025
సర్పంచ్‌లే గ్రామాభివృద్ధి సారథులు: మంత్రి పొన్నం

కరీంనగర్ డీసీసీలో నూతన కాంగ్రెస్ సర్పంచ్‌లను మంత్రి పొన్నం ప్రభాకర్ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో మౌలిక వసతులు, ప్రభుత్వ పాఠశాలల బలోపేతంపై సర్పంచ్‌లు ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. అభివృద్ధి నిధులు త్వరలో వస్తాయని భరోసానిచ్చారు. ఉపాధి హామీని నిర్వీర్యం చేస్తున్న కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ.. రేపు గాంధీ విగ్రహాల వద్ద నిరసనలు తెలపాలని పిలుపునిచ్చారు.
News December 27, 2025
U-19 WC: టీమ్ ఇండియా ఇదే..

సౌతాఫ్రికా సిరీస్‌తో పాటు మెన్స్ U-19 WCకు భారత జట్టును BCCI ప్రకటించింది. ఆసియాకప్‌లో కెప్టెన్‌గా వ్యవహరించిన ఆయుశ్ మాత్రేకు మరోసారి బాధ్యతలు అప్పగించింది.
జట్టు: ఆయుశ్(C), విహాన్(VC), వైభవ్ సూర్యవంశీ, అరోన్ జార్జి, వేదాంత్ త్రివేది, అభిజ్ఞాన్, హర్వంశ్ సింగ్, అంబ్రీశ్, కనిశ్క్ చౌహన్, ఖిలాన్ పటేల్, మహ్మద్ ఈనాన్, హెనిల్ పటేల్, దీపేశ్, కిషాన్ సింగ్, ఉధవ్ మోహన్


