News March 15, 2025
హైదరాబాద్ నుంచే 50% ఆదాయం!

TG: 2022-23 లెక్కల ప్రకారం రాష్ట్ర జీడీపీలో హైదరాబాద్ వాటా 50.41%గా ఉందని తాజాగా వెల్లడైంది. దీని ప్రకారం మిగతా జిల్లాలు ఆశించినంతగా ఆదాయం తీసుకురావట్లేదని అర్థమవుతోంది. దేశంలోని ఏ రాష్ట్రంలోనూ ఒక్క నగరం ఇంత సంపద తీసుకురావట్లేదు. ముంబై ఆదాయం 36.3%, బెంగళూరు 40.91%, చెన్నై 31.59%గా ఉంది. మిగతా జిల్లాలను కూడా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని, వికేంద్రీకరణ జరగాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Similar News
News January 11, 2026
కోహ్లీ సెంచరీ మిస్

స్టార్ క్రికెటర్ కోహ్లీ త్రుటిలో సెంచరీ చేజార్చుకున్నారు. న్యూజిలాండ్‌తో తొలి వన్డేలో 91 బంతుల్లో 93 పరుగులు చేసి ఔటయ్యారు. జెమీసన్ బౌలింగ్‌లో బ్రేస్‌వెల్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగారు. దీంతో కింగ్ నుంచి మరో సెంచరీ చూడాలనుకున్న ఫ్యాన్స్‌కు నిరాశే ఎదురైంది. విరాట్ ఔటయ్యే సమయానికి భారత్ స్కోర్ 234/3. టీమ్ ఇండియా విజయానికి 64 బంతుల్లో 67 రన్స్ అవసరం.
News January 11, 2026
గుమ్మానికి ఎదురుగా మరో గుమ్మం ఉండవచ్చా?

ఇంటి ప్రధాన ద్వారానికి ఎదురుగా మరో గుమ్మం ఉండటం శుభప్రదమని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచిస్తున్నారు. ఇలా ఉంటే గదులు, హాల్స్‌ను క్రమబద్ధంగా వినియోగించుకోవడానికి వీలవుతుందని చెబుతున్నారు. ‘దీనివల్ల ఇంటి లోపల శక్తి ప్రసరణ సాఫీగా జరిగి, కుటుంబీకుల మధ్య సఖ్యత పెరుగుతుంది. ఇల్లు చూసేందుకు అందంగా, అమరికగా కనిపిస్తుంది. ఈ నియమాన్ని పాటిస్తే గృహంలో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంటుంది’ అంటున్నారు. <<-se>>#Vasthu<<>>
News January 11, 2026
చచ్చిపోవాలనే ఆలోచనల నుంచి అలా బయటపడ్డా: మలయాళ నటి

డిప్రెషన్‌లో ఉన్న సమయంలో మానసిక చికిత్స తీసుకోవడం చాలా అవసరమని హీరోయిన్ పార్వతీ తిరువోతు అన్నారు. ఒకానొక సమయంలో తీవ్రమైన ఒంటరితనంతో బాధపడ్డానని, ఆ టైమ్‌లో చచ్చిపోవాలనే ఆలోచనలు కూడా వచ్చాయని తెలిపారు. థెరపీ తీసుకోవడంతో దాని నుంచి బయటపడినట్లు ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. తనను బాధపెట్టిన 2021లోని జనవరి, ఫిబ్రవరి నెలలను జీవితం నుంచి తీసేసినట్లు చెప్పారు. ఈ మలయాళ బ్యూటీ నాగచైతన్య ‘దూత’లో నటించారు.


