News March 15, 2025
హిందీ వివాదం: పవన్ కళ్యాణ్‌కు DMK MP కనిమొళి కౌంటర్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు TN CM స్టాలిన్ సోదరి, DMK MP కనిమొళి కౌంటర్ ఇచ్చారు. భాషాపరమైన అడ్డంకులు లేకుండా సినిమాలు చూసేందుకు టెక్నాలజీ సాయపడుతుందని పేర్కొన్నారు. గతంలో ‘హిందీ గోబ్యాక్!’ ఆర్టికల్‌ను షేర్ చేస్తూ పవన్ పెట్టిన ట్వీట్, నిన్న ‘తమిళ సినిమాలను హిందీలోకి ఎందుకు డబ్ చేస్తున్నారు’ అని ప్రశ్నించిన వీడియో స్క్రీన్‌షాట్‌ను పోస్ట్ చేశారు. BJPలో చేరక ముందు, చేరాక అంటూ క్యాప్షన్ ఇచ్చారు.
Similar News
News March 16, 2025
శ్రీశైలంలో ఆన్‌లైన్ గదుల పేరుతో భక్తులకు టోకరా..!

AP: శ్రీశైలం క్షేత్రంలో ఆన్‌లైన్ మోసగాళ్లు వసతి గదుల పేరుతో నకిలీ వెబ్‌సైట్‌లు సృష్టించి భక్తులను మోసం చేస్తున్నారు. ఒక భక్తుడు మల్లికార్జున సదన్ పేరుతో ఉన్నవెబ్‌సైట్‌లో గదులు బుక్ చేసుకున్నారు. దీనికిగాను రూ.7000 చెల్లించాడు. తీరా గదుల కోసం విచారించగా నకిలీదని తేలింది. హైదరాబాద్‌కు చెందిన మరో వ్యక్తి ఈ విధంగానే మోసపోయాడు. అధికారులు స్పందించి మోసాలను అరికట్టాలని భక్తులు కోరుతున్నారు.
News March 16, 2025
IPL: ఆ జట్టుకు బ్యాడ్ న్యూస్

మరో వారంలో ఐపీఎల్ ప్రారంభం కానుండగా రాజస్థాన్ రాయల్స్‌కు షాక్ తగిలింది. ఆ జట్టు కెప్టెన్ సంజూ శాంసన్‌కు బెంగళూరులోని ఎన్సీఏ ఇంకా క్లియరెన్స్ సర్టిఫికెట్ ఇవ్వలేదు. దీంతో 23న SRHతో మ్యాచుకు ఆయన దూరమయ్యే ఛాన్స్ ఉంది. ఒకవేళ ఆడినా బ్యాటింగ్ మాత్రమే చేస్తారు. వికెట్ కీపింగ్ బాధ్యతల నుంచి తప్పుకోనున్నారు. లేదంటే ఆయన స్థానంలో ధ్రువ్ జురెల్ బరిలోకి దిగొచ్చని వార్తలు వస్తున్నాయి.
News March 16, 2025
కమెడియన్లతో నటించేందుకు ఇష్టపడరు: సప్తగిరి

కమెడియన్లతో నటించేందుకు హీరోయిన్లు ఇష్టపడరని నటుడు సప్తగిరి అన్నారు. తాను ప్రధాన పాత్రలో నటించిన ‘పెళ్లి కాని ప్రసాద్’ మూవీ ప్రమోషన్లలో ఆయన మాట్లాడారు. ‘కమెడియన్ల పక్కన హీరోయిన్లు దొరకడం కష్టం. చాలా మంది కమెడియన్ పక్కనా? అంటారు. తన పక్కన నటించడానికి ఒప్పుకున్న ప్రియాంక శర్మకు ధన్యవాదాలు’ అని తెలిపారు. అలాగే, సినిమా వాళ్లకు ఎంత పేరొచ్చినా, మంచి అలవాట్లు ఉన్నా పిల్లను ఇవ్వరని తెలిపారు.