News March 15, 2025
అల్లూరి: ఇంటర్ పరీక్షలకు 195మంది గైర్హాజరు

అల్లూరి జిల్లాలో 26 పరీక్ష కేంద్రాల్లో శనివారం ద్వితీయ ఇంటర్ జనరల్ కెమిస్ట్రీ, కామర్స్ పరీక్షలు జరిగాయి. జనరల్ పరీక్షలకు మొత్తం 4,170మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 4050మంది రాసారని, 116ఆబ్సెంట్ అయ్యారని జిల్లా ఇంటర్మీడియేట్ విద్యాధికారి అప్పలరాం తెలిపారు. 8కేంద్రాల్లో ఒకేషనల్ పరీక్షలకు 884మందికి గాను 805మంది హాజరు అయ్యారని, 79మంది ఆబ్సెంట్ అయ్యారని తెలిపారు.
Similar News
News March 16, 2025
శ్రీశైలంలో ఆన్‌లైన్ గదుల పేరుతో భక్తులకు టోకరా..!

AP: శ్రీశైలం క్షేత్రంలో ఆన్‌లైన్ మోసగాళ్లు వసతి గదుల పేరుతో నకిలీ వెబ్‌సైట్‌లు సృష్టించి భక్తులను మోసం చేస్తున్నారు. ఒక భక్తుడు మల్లికార్జున సదన్ పేరుతో ఉన్నవెబ్‌సైట్‌లో గదులు బుక్ చేసుకున్నారు. దీనికిగాను రూ.7000 చెల్లించాడు. తీరా గదుల కోసం విచారించగా నకిలీదని తేలింది. హైదరాబాద్‌కు చెందిన మరో వ్యక్తి ఈ విధంగానే మోసపోయాడు. అధికారులు స్పందించి మోసాలను అరికట్టాలని భక్తులు కోరుతున్నారు.
News March 16, 2025
జనగామ: బిక్షాటన చేస్తూ విద్యార్థుల నిరసన

జనగామ జిల్లా కేంద్రంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయి నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు వినూత్న రీతిలో బిక్షాటన చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పట్టణంలో వ్యాపార సముదాయాల్లో తిరుగుతూ భిక్షాటన చేశారు. సకాలంలో స్కాలర్షిప్లు రాకపోవడంతో ఫీజులు కట్టాలని కాలేజీలు ఒత్తిడికి గురి చేస్తుందన్నారు. ప్రభుత్వ స్పందించి వెంటనే బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
News March 16, 2025
ప్రభుత్వ బడుల్లోనే నాణ్యమైన విద్య: కలెక్టర్ క్రాంతి

ప్రభుత్వ బడుల్లోనే నాణ్యమైన విద్య అందుతుందన సంగారెడ్డి కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. పటాన్ చెరు మండలం ముత్తంగి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తల్లిదండ్రుల సమావేశం శనివారం నిర్వహించారు. పాఠశాలలో విద్యాబోధన తీరని తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రతి తల్లిదండ్రులపై ఉందని చెప్పారు. సమావేశంలో జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.