News March 15, 2025

రేపు జనగామ జిల్లాకు సీఎం రాక

image

జనగామ జిల్లాకు ఆదివారం సీఎం రేవంత్ రెడ్డి రానున్నారు. ఈ సందర్భంగా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో రూ.800 కోట్ల నిధులతో పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన చేయనున్నారు. ఆదివారం మధ్యాహ్నం 1:30 గంటలకు నియోజకవర్గానికి రానున్న సందర్భంగా స్టేషన్ ఘనపూర్ మండలంలోని శివునిపల్లిలో సభకు అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.

Similar News

News March 15, 2026

NGKL: ఉపకరణాల కోసం ఎస్సీలు దరఖాస్తులు చేసుకోవాలి: కలెక్టర్

image

ఎస్సీ యాక్షన్ ప్లాన్‌లో భాగంగా బ్యాంకు అనుసంధానంతో ఎస్సీలకు వివిధ రకాల ఉపకరణాలు అందజేయడానికి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ పేర్కొన్నారు. 2025-26 యాక్షన్ ప్లాన్‌లో భాగంగా ఎలక్ట్రిక్ ద్విచక్ర, త్రిచక్ర వాహనాలు, సోలార్ యూనివర్సల్ పంపు కంట్రోల్లకు సబ్సిడీలు అందించనున్నారు. 21 ఏళ్ల నుంచి 50 ఏళ్ల వరకు వయసు కలిగిన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని పేర్కొన్నారు.

News March 15, 2026

ప్రతి ఒక్కరినీ అక్షరాస్యులుగా చేయడమే లక్ష్యం: కలెక్టర్

image

ప్రతి ఒక్కరినీ అక్షరాస్యులుగా చేయడమే ప్రభుత్వ లక్ష్యని కర్నూలు కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి అన్నారు. ఆదివారం కర్నూలులోని శ్రీరామ్ నగర్‌లో ఉన్న నగర పాలక ప్రాథమిక పాఠశాలలో అక్షరాంధ్ర కార్యక్రమం ద్వారా అభ్యాసకులకు నిర్వహిస్తున్న పరీక్ష కేంద్రాన్ని ఆమె తనిఖీ చేశారు. పరీక్ష కేంద్రాల వద్ద అన్ని మౌలిక సదుపాయాలని కల్పించినట్లు కలెక్టర్ తెలిపారు.

News March 15, 2026

TVKతో పొత్తు ఉండదు: పళనిస్వామి

image

TNలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో TVKతో పొత్తు ఉండబోదని AIADMK జనరల్ సెక్రటరీ K.పళనిస్వామి తెలిపారు. మీడియాలో వస్తున్నవంతా వదంతులేనని కొట్టిపారేశారు. ఇప్పటి వరకు ఆ పార్టీతో అసలు చర్చలే జరపలేదన్నారు. అలాగే BJP లీడర్ అన్నామలైతో తనకు ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు. మరోవైపు NDAతో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని స్టార్ హీరో, TVK చీఫ్ విజయ్ పేర్కొన్న సంగతి తెలిసిందే.