News March 15, 2025
అసెంబ్లీ ప్రొటెం స్పీకర్ స్థానంలో కూనంనేని

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో జరుగుతున్న బడ్జెట్ సమావేశాల్లో శనివారం రోజు అసెంబ్లీ స్పీకర్ స్థానంలో కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కూర్చొని అధ్యక్షత వహించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధిపై ప్రసంగిస్తున్న సమయంలో ప్రొటెం స్పీకర్ స్థానంలో కూనంనేని ఉండడం పట్ల సీపీఐ నాయకులు, కొత్తగూడెం ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News March 20, 2026
చిత్తూరు: మూతపడుతున్న పెట్రోల్ బంకులు

బంకులకు పెట్రోల్ సరఫరా తగ్గడంతో స్టాక్ లేక పలు పెట్రోల్ బంకులు మూతపడుతున్నాయి. యుద్ధం నేపథ్యంలో ఇంధన కొరత ఏర్పడుతుందన్న భయంతో వాహనదారులు అవసరానికి మించి పెట్రోల్, డీజిల్ కొనుగోలు చేస్తుండగా స్టాక్ త్వరగా అయిపోతుంది. అయితే ఇందన సరఫరా ఆలస్యం అవుతుండడంతో స్టాక్ లేక పెట్రోల్ బంకులు మూతపడుతున్నాయి. హైవేపై ఉన్న బంకుల్లో ఈ సమస్య మరీ ఎక్కువగా ఉన్నట్లు సమాచారం.
News March 20, 2026
స్టాక్ మార్కెట్లకు జోష్.. రూపాయి డౌన్

నిన్నటి భారీ నష్టాల నుంచి ఈరోజు స్టాక్ మార్కెట్లు కోలుకొని లాభాలతో ట్రేడింగ్ ముగించాయి. సెన్సెక్స్ 325 పాయింట్ల లాభంతో 74,532 వద్ద, నిఫ్టీ 112 పాయింట్లు ఎగిసి 23,114 వద్ద సెటిల్ అయ్యాయి. క్రూడ్ టెన్షన్స్ తగ్గడం, కొనుగోళ్లు పెరగడం వంటివి మార్కెట్లలో జోష్ నింపాయి. రూపాయి మాత్రం ఒక డాలరుకు ₹93 మార్క్ దాటి జీవితకాల కనిష్ఠాన్ని నమోదు చేసింది. FII విక్రయాలు, డాలర్ డామినేషన్, యుద్ధం ఇందుకు కారణాలు.
News March 20, 2026
కల్తీ జరిగితే ఈ నంబర్‌కు కాల్ చేయండి

TG: హైదరాబాద్‌లో ఆహార కల్తీ నియంత్రణకు పోలీసులు ‘హైదరాబాద్ ఫుడ్ అడల్ట్రేషన్ సర్వైలెన్స్ టీమ్’ను ఏర్పాటు చేశారు. ఇందులో సీఐలు, ఎస్సైలు, ఇతర సిబ్బందితో కలిపి మొత్తం 28 మంది సభ్యులు ఉంటారు. కల్తీకి పాల్పడే వారిని గుర్తించడం, నిఘా ఉంచడం, దాడులు నిర్వహించడం, నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం వీరి బాధ్యత. ఎక్కడైనా కల్తీ జరిగితే టోల్ ఫ్రీ నంబర్ 87126 61212కి కాల్ చేయాలని ప్రజలకు సూచించారు.


