News March 15, 2025

రేపు జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ నిరసనలు: ఆంజనేయులు

image

రేపు జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్ పిలుపునిచ్చారు. నర్సాపూర్‌లో ఆయన మాట్లాడుతూ.. అసెంబ్లీలో స్పీకర్ పట్ల ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ఇచ్చిన పిలుపు మేరకు జిల్లా వ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని కార్యకర్తలను కోరారు.

Similar News

News March 10, 2026

సంక్షేమ శాఖ పనితీరు ఆదర్శనీయం: ఐసీడీఎస్ డైరెక్టర్

image

మెదక్ జిల్లాలో మహిళా, శిశు సంక్షేమ శాఖ పనితీరు ఆదర్శంగా ఉందని ఐసీడీఎస్ డైరెక్టర్ శృతి ఓజా ప్రశంసించారు. సోమవారం ఆమె మెదక్ జిల్లా కలెక్టరేట్‌లో కలెక్టర్ ప్రతిమ సింగ్‌తో భేటీ అయ్యారు. అంగన్‌వాడీ కేంద్రాలను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని, జిల్లాలోని కేంద్రాలు, సఖి సెంటర్లలో బాధితులకు, చిన్నారులకు మెరుగైన సేవలు అందుతున్నాయని సంతృప్తి వ్యక్తం చేశారు.

News March 9, 2026

శ్రీ తునికి నల్ల పోచమ్మ అమ్మవారికి ప్రత్యక పూజలు

image

మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం శ్రీతునికి నల్ల పోచమ్మకు అర్చకుడు శివప్ప ప్రత్యేక పూజలు చేశారు. నేడు సోమవారం రెండో రోజు బండ్లు తిరుగుట, అలాగే అమ్మవారిని పల్లకీలో ఊరేగించారు. అమ్మవారికి ఒడిబియ్యం, నైవేద్యం సమర్పించి, ధూప దీపాలతో అష్టోత్తర నామాలతో పూజలు చేశారు. పలు గ్రామాల నుంచి వచ్చిన భక్తులకు తీర్థప్రసాదాలు అందించారు.