News March 15, 2025

హిందీపై పవన్ కామెంట్స్.. జనసేన శతఘ్ని క్లారిటీ

image

గతంలో పవన్ హిందీని వ్యతిరేకించారని జరుగుతున్న ప్రచారంపై జనసేన శతఘ్ని టీమ్ క్లారిటీ ఇచ్చింది. ‘పవన్ హిందీని మాత్రమే నేర్చుకోవాలనే నిబంధనను వ్యతిరేకించారు. త్రిభాషా విధానంలో హిందీని కచ్చితంగా అమలు చేయాలనే రూల్ లేదు. NEP-2020 ప్రకారం విద్యార్థులు మాతృభాషతో పాటు ఏదైనా భారతీయ భాష, విదేశీ భాష నేర్చుకునే సౌలభ్యం ఉంది. రాజకీయాల కోసం హిందీని రుద్దుతున్నారనే ప్రచారం చేస్తున్నారు’ అని ట్వీట్ చేసింది.

Similar News

News March 16, 2025

Congratulations: ముంబైదే WPL ట్రోఫీ

image

ఉత్కంఠ పోరులో WPL టైటిల్‌ను ముంబై గెలిచింది. 8 పరుగుల తేడాతో ఢిల్లీపై విజయం సాధించి మూడేళ్ల లీగ్ చరిత్రలో రెండో‌సారి కప్ అందుకుంది. ముంబై నిర్దేశించిన 150 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ 9 వికెట్లు కోల్పోయి 141 పరుగులే చేయగలిగింది. నికీ ప్రసాద్ (25*)పోరాడినా ఫలితం లేకపోయింది. కాప్ 40 పరుగులతో రాణించారు. బ్రంట్ 3 వికెట్లతో సత్తా చాటారు. 2023లోనూ ముంబై కప్ గెలిచిన విషయం తెలిసిందే.

News March 16, 2025

విడుదలైన వారానికే OTTలోకి థ్రిల్లర్ మూవీ

image

మలయాళ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ‘ఆఫీసర్ ఆన్ డ్యూటీ’ ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. నెట్‌ఫ్లిక్స్‌లో ఈ నెల 20 నుంచి తెలుగుతోపాటు, తమిళం, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. కాగా ఈ సినిమా ఈ నెల 14న తెలుగులో థియేటర్లలో విడుదలైంది. రిలీజైన వారంలోపే ఓటీటీ విడుదలకు సిద్ధం కావడం విశేషం. ఈ చిత్రంలో కుంచకో బోబన్, ప్రియమణి ప్రధాన పాత్రలు పోషించారు.

News March 16, 2025

ఇది జగన్మాత ఆదేశం: పవన్ కళ్యాణ్

image

AP: భారతదేశ ఔన్నత్యాన్ని తెలిపేలా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. ‘ఉత్తరాదినున్న హిమాలయాల్లో ఉంది ‘పరమశివుని’ కైలాసం. దక్షిణాది ఆయన కుమారుడు ‘మురుగన్’ నివాసం. వారు వెలిసిన ప్రదేశం ఈ ‘భారతదేశం’. ఇది జగన్మాత ఆదేశం’ అని పేర్కొన్నారు. ఉత్తర భారతానికి, దక్షిణాదికి తేడా లేదని చెప్పేందుకు పవన్ ఈ ట్వీట్ చేసినట్లు తెలుస్తోంది.

error: Content is protected !!