News March 15, 2025
ఆ బ్యాంకు డిపాజిటర్లు భయపడొద్దు: RBI

ఇండస్ఇండ్ బ్యాంకుపై వదంతులను RBI కొట్టిపారేసింది. ‘డిపాజిటర్లు వాటిని నమ్మొద్దు. భయపడాల్సిన అవసరం లేదు. బ్యాంకు ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంది. తగినంత మూలధనమూ ఉంది. ఇప్పటికే మా ఎక్స్టర్నల్ ఆడిట్ టీమ్‌తో కలిసి A/Cను బ్యాంకు సమగ్రంగా సమీక్షిస్తోంది’ అని తెలిపింది. బ్యాంకు డెరివేటివ్ పోర్టుఫోలియోలో Rs1580 CR అవకతవకలు జరగడం, మొత్తం నెట్‌వర్త్‌పై దాని ప్రభావం 2.35% ఉంటుందన్న వార్తలపై స్పందించింది.
Similar News
News March 16, 2025
Congratulations: ముంబైదే WPL ట్రోఫీ

ఉత్కంఠ పోరులో WPL టైటిల్‌ను ముంబై గెలిచింది. 8 పరుగుల తేడాతో ఢిల్లీపై విజయం సాధించి మూడేళ్ల లీగ్ చరిత్రలో రెండోసారి కప్ అందుకుంది. ముంబై నిర్దేశించిన 150 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ 9 వికెట్లు కోల్పోయి 141 పరుగులే చేయగలిగింది. నికీ ప్రసాద్ (25*)పోరాడినా ఫలితం లేకపోయింది. కాప్ 40 పరుగులతో రాణించారు. బ్రంట్ 3 వికెట్లతో సత్తా చాటారు. 2023లోనూ ముంబై కప్ గెలిచిన విషయం తెలిసిందే.
News March 16, 2025
విడుదలైన వారానికే OTTలోకి థ్రిల్లర్ మూవీ

మలయాళ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ‘ఆఫీసర్ ఆన్ డ్యూటీ’ ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. నెట్‌ఫ్లిక్స్‌లో ఈ నెల 20 నుంచి తెలుగుతోపాటు, తమిళం, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. కాగా ఈ సినిమా ఈ నెల 14న తెలుగులో థియేటర్లలో విడుదలైంది. రిలీజైన వారంలోపే ఓటీటీ విడుదలకు సిద్ధం కావడం విశేషం. ఈ చిత్రంలో కుంచకో బోబన్, ప్రియమణి ప్రధాన పాత్రలు పోషించారు.
News March 16, 2025
ఇది జగన్మాత ఆదేశం: పవన్ కళ్యాణ్

AP: భారతదేశ ఔన్నత్యాన్ని తెలిపేలా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. ‘ఉత్తరాదినున్న హిమాలయాల్లో ఉంది ‘పరమశివుని’ కైలాసం. దక్షిణాది ఆయన కుమారుడు ‘మురుగన్’ నివాసం. వారు వెలిసిన ప్రదేశం ఈ ‘భారతదేశం’. ఇది జగన్మాత ఆదేశం’ అని పేర్కొన్నారు. ఉత్తర భారతానికి, దక్షిణాదికి తేడా లేదని చెప్పేందుకు పవన్ ఈ ట్వీట్ చేసినట్లు తెలుస్తోంది.