News March 15, 2025

బాపట్ల: ఇంటర్ పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసిన స్పెషలాఫీసర్

image

బాపట్ల పట్టణంలో ఇంటర్ పరీక్ష కేంద్రాలను బాపట్ల జిల్లా స్పెషల్ అధికారి కృతిక శుక్ల బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకట మురళితో కలిసి పరిశీలించారు. శనివారం ఇంటర్ పరీక్ష కేంద్రాలను పరిశీలించి పరీక్షలు జరుగుతున్న తీరును పరిశీలించారు. బాపట్ల జిల్లాలో ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో బాపట్ల జిల్లా జాయింట్ కలెక్టర్ ప్రకార్ జైన్, తదితర అధికారులు పాల్గొన్నారు.

Similar News

News January 21, 2026

గ్రామపంచాయతీ నుంచి రామగుండం కార్పొరేషన్ వరకు..

image

జనగామ గ్రామ పంచాయతీ 11 వార్డులతో సర్పంచిగా గీట్ల జనార్థన్ రెడ్డి నుంచి రామగుండం 60 డివిజన్ల కార్పొరేషన్ వరకు విస్తరించింది. 1982లో రామగుండం నోటిఫైడ్ ఏరియా, 1957- 2009 వరకు RGM ప్రాంతం మేడారం నియోజకవర్గంలో ఉండేది. 1995లో మున్సిపాలిటీగా, 2003లో కార్పొరేషన్‌గా హోదా పెరిగింది. కార్పొరేషన్‌కు ఈసారి మూడోసారి ఎన్నికలు జరగనున్నాయి. సుమారు 93.87 చ.కి. వైశాల్యంలో విస్తరించి ఉంది.

News January 21, 2026

NZB: 1931లో మున్సిపాలిటీ.. 2005లో కార్పొరేషన్

image

NZB మున్సిపాలిటీ 1931 సంవత్సరంలో ఏర్పడింది. 1987లో దీన్ని ‘స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీ’గా అప్‌గ్రేడ్ చేశారు. 2005 మార్చి 5న ప్రభుత్వం జారీ చేసిన GO No.109 ప్రకారం నగరపాలక సంస్థ మున్సిపల్ కార్పొరేషన్‌గా మారింది. ప్రస్తుతం ఇది నిజామాబాద్ నగరపాలక సంస్థ పేరుతో 60 వార్డులతో పరిపాలన కొనసాగిస్తోంది.

News January 21, 2026

రాజీవ్ గాంధీ నేషనల్ ఇన్‌‌స్టిట్యూట్ ఆఫ్ యూత్ డెవలప్‌మెంట్‌లో ఉద్యోగాలు

image

రాజీవ్ గాంధీ నేషనల్ ఇన్‌‌స్టిట్యూట్ ఆఫ్ యూత్ డెవలప్‌మెంట్‌ <>(RGNIYD) <<>>6 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హతగల వారు రేపు ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. పోస్టును PG (ఎకనామిక్స్, సోషియాలజీ, యూత్ స్టడీస్, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషల్ వర్క్, యూత్ డెవలప్‌మెంట్), NET/SLAT/SET, PhD ఉత్తీర్ణులు అర్హులు. నెలకు రూ.52వేలు చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://www.rgniyd.gov.in