News March 15, 2025

అభివృద్ధి, సంక్షేమం ప్రభుత్వానికి రెండు కళ్లు: మంత్రి సవిత

image

ఏపీలో అభివృద్ధి, సంక్షేమాన్ని రెండు కళ్లుగా భావిస్తున్నామని మంత్రి సవిత పేర్కొన్నారు. శనివారం ఆమె మండలంలోని పెద్దగువ్వల పల్లి నుంచి కల్లుకుంట వరకు రూ.75 లక్షలతో నిర్మించే బీటీ రోడ్డు నిర్మాణానికి ఆమె భూమిపూజ చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీమేరకు ఇప్పటికే 73 పనులకు రూ.5.75 కోట్లు ఖర్చుచేసి పూర్తి చేశామన్నారు. నల్లూరు-దండేపల్లి, DR కొట్టాల-దొడగట్ట వరకు బీటీ రోడ్డు నిర్మిస్తున్నట్లు చెప్పారు.

Similar News

News March 20, 2026

NTR: 23తో ముగియనున్న గడువు..త్వరపడండి

image

కృష్ణా వర్సిటీలో పీజీ 4వ సెమిస్టర్ విద్యార్థులు రాయాల్సిన MOOCS (మాసివ్ ఓపెన్ ఆన్‌లైన్ కోర్స్)పరీక్షలను ఏప్రిల్ 29న నిర్వహిస్తున్నట్లు వర్సిటీ వర్గాలు తెలిపాయి. మార్చి 23లోపు ఈ పరీక్ష రాసే విద్యార్థులు రూ. 250 ఫీజును http://www.onlinesbi.com/లో చెల్లించాల్సి ఉంటుందన్నాయి. MOOCS పరీక్ష పూర్తి వివరాలకు https://kru.ac.in/ చూడవచ్చని సూచించాయి.

News March 20, 2026

TG బడ్జెట్ కేటాయింపులు.. ఏ శాఖకు ఎంత?

image

☛ గృహ నిర్మాణం: రూ.7,430కోట్లు ☛ ST సంక్షేమం: రూ.7,937కోట్లు ☛ BC సంక్షేమం: రూ.12,511కోట్లు ☛ మైనార్టీ సంక్షేమం: రూ.3,769కోట్లు ☛ యువ వికాసం: రూ.6వేల కోట్లు ☛ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి: రూ.33,688 కోట్లు ☛ సాగునీటి ప్రాజెక్టులకు: రూ.22,615కోట్లు ☛ రవాణా, R&B: రూ.12,789కోట్లు ☛ పురపాలక, పట్టణాభివృద్ధి: రూ.17,907కోట్లు ☛ హోంశాఖ: రూ.11,907కోట్లు ☛ విద్యాశాఖ: రూ.26,674 కోట్లు

News March 20, 2026

మణిరత్నం కొత్త మూవీ ప్రకటన

image

ప్రముఖ దర్శకుడు మణిరత్నం కొత్త మూవీని ప్రకటించారు. విజయ్ సేతుపతి – సాయి పల్లవి జంటగా సినిమా తీస్తున్నట్లు తెలిపారు. దీనికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నట్లు పేర్కొన్నారు. లైకా ప్రొడక్షన్స్ మూవీని నిర్మిస్తోంది. ఈ బ్యానర్‌కు ఇది 23వ సినిమా. మణిరత్నం-రెహమాన్ కాంబోలో మరో మ్యూజికల్ హిట్ ఖాయమని వీరి ఫ్యాన్స్ SMలో కామెంట్లు పెడుతున్నారు.