News March 15, 2025
నీటి కుంటలో పడి ఇద్దరు బాలికల మృతి

అనంతపురం జిల్లాలో శనివారం విషాదం చోటుచేసుకుంది. గార్లదిన్నె మండలం కల్లూరు గ్రామ సమీపంలో సంచారాలు చేసేవారు నివాసం ఉంటున్నారు. అయితే ఎద్దులు మేపేందుకు ఇద్దరు బాలికలు వెళ్లారు. ఎడ్లు పెన్నా నదిలో దిగి నీరు తాగుతుండగా.. వాటిని బయటకు తోలే ప్రయత్నంలో ఇద్దరు బాలికలు ప్రమాదవశాత్తు నీటిలో పడి మృతి చెందారు. మృతులు కల్లూరుకి చెందిన లక్ష్మి(10), హరిణి(12)గా గుర్తించారు. పోలీసులు విచారణ చేపట్టారు.
Similar News
News March 16, 2025
విద్యార్థినులపై ప్రొఫెసర్ లైంగికదాడి.. వీడియోలు వైరల్

విద్యార్థినుల పాలిట గురువే కీచకుడిగా మారాడు. యూపీ హథ్రాస్‌లోని పీజీ కాలేజీ ప్రొఫెసర్ విద్యార్థినులకు మాయమాటలు చెప్పి లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీనికి సంబంధించిన 59 వీడియోలు సోషల్ మీడియాలో వైరలవ్వగా బాధితులు పోలీసులను ఆశ్రయించారు. దీంతో కేసు నమోదు చేసి అతడి కోసం గాలింపు చేపట్టారు. కాగా ప్రొఫెసర్ గతంలోనూ ఇలాంటి ఆకృత్యాలకు పాల్పడినట్లు సమాచారం. దీనిపై కాలేజీ యాజమాన్యం స్పందించకపోవడం గమనార్హం.
News March 16, 2025
అచ్చంపేట: ఘాట్ రోడ్డులో ఆటో బోల్తా.. వ్యక్తి మృతి

అచ్చంపేట మండలం ఉమామహేశ్వరం దేవాలయం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. కొండపై నుంచి కిందికి వస్తున్న ఆటో ఘాట్ రోడ్డులో బోల్తా పడింది. అమ్రాబాద్ మండలం తెలుగుపల్లికి చెందిన తిరుపతయ్య అక్కడికక్కడే మృతి చెందారు. మరి కొంత మందికి తీవ్ర గాయాలయ్యాయని అచ్చంపేట పోలీసులు తెలిపారు. ఓ పెళ్లి వేడుక నిమిత్తం కొండపైకి వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో ఘటన జరిగిందని అన్నారు. గాయాలైన వారిని అచ్చంపేట ఆసుపత్రికి తరలించారు.
News March 16, 2025
నెల్లూరు: రైతును చెరువులో తోసి నగదుతో పరార్

తక్కువ ధరకు డీజిల్ ఇస్తానని నమ్మించి ఓ అపరిచితుడు రైతును బూరిడీ కొట్టించిన ఘటన ఆదివారం మనుబోలులో చోటు చేసుకుంది. మనుబోలుకు చెందిన ఓ రైతుకు బైకుపై వచ్చిన ఓ వ్యక్తి పరిచయం అయ్యాడు. రైతుకు తక్కువ ధరకు 300 లీటర్లు డీజిల్ ఇస్తామని నమ్మించి 25 వేల రూపాయలను రైతు నుంచి తీసుకున్నాడు. అ తర్వాత ఆ రైతును చెరువులో తోసి పరారయ్యాడు.