News March 15, 2025
సిరిసిల్ల: నీటి సరఫరాకు అంతరాయం: ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్

సిరిసిల్లలోని 120MLD నీటి శుద్ధి కేంద్రంలోని తాగునీరు నీటి పంపు హౌస్‌లో పంపుల మరమ్మతు జరుగుతున్నందున ఈనెల 16న సిరిసిల్ల, వేములవాడ, చొప్పదండి నియోజకవర్గాల్లో నీటి సరఫరాకు అంతరాయం కలుగుతుందని EE శేఖర్ రెడ్డి తెలిపారు. సిరిసిల్ల పట్టణంలోని కలెక్టరేట్లో ఆయన శనివారం ప్రకటన విడుదల చేశారు. మళ్లీ ఈనెల 17వ తేదీన నీటి సరఫరా యథావిధిగా సాగుతుందని ప్రజలు సహకరించాలన్నారు.
Similar News
News October 29, 2025
భారీ వర్షాలు.. ఖమ్మం సీపీ కీలక సూచనలు

ఖమ్మం జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు పాటించాలని సీపీ సునీల్ దత్ సూచించారు. నీట మునిగిన రోడ్లు, వాగులు, వంతెనలు దాటే ప్రయత్నం చేయవద్దని, చేపల వేటకు వెళ్లవద్దని, సెల్ఫీల కోసం నీటి ప్రవాహం వద్దకు వెళ్లరాదని హెచ్చరించారు. అత్యవసర సమయాల్లో డయల్ 100, 1077 లేదా 87126 59111 నంబర్లకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. చెరువులు, వాగుల వద్ద పోలీసులు పహారా పెంచారని ఆయన పేర్కొన్నారు.
News October 29, 2025
నందిగామలో తుఫాను బీభత్సం.. రెండు ఇళ్లు ధ్వంసం

పెడన మండలం నందిగామపై తుపాన్ తీవ్ర ప్రభావం చూపింది. భారీ ఈదురు గాలులు, వర్షాల కారణంగా ఒక పెద్ద వృక్షం కూలి, రెండు నివాస గృహాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. అదనంగా, మరో ఆరు ఇళ్లు, ఒక పశువుల పాక, రెండు ప్రహరీలు కూడా దెబ్బతిన్నాయని సర్పంచ్ చినబాబు తెలిపారు. అదృష్టవశాత్తూ ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. అధికారులు నష్టాన్ని అంచనా వేసేందుకు చర్యలు చేపట్టారు.
News October 29, 2025
మధ్యాహ్నానికి సాధారణ స్థితి: CM చంద్రబాబు

AP: మొంథా తుఫాన్ తీరం దాటిందని, ఇవాళ మధ్యాహ్నానికి సాధారణ స్థితి నెలకొంటుందని CM చంద్రబాబు తెలిపారు. తుఫాన్ కారణంగా రాష్ట్రంలో ఇద్దరు మరణించినట్లు చెప్పారు. దెబ్బతిన్న విద్యుత్ వ్యవస్థ పునరుద్ధరణకు 10వేల మందిని అందుబాటులో ఉంచినట్లు వెల్లడించారు. ఎస్డీఆర్ఎఫ్, పోలీసులు, ఫైర్ సిబ్బంది బాగా పనిచేశారని అభినందించారు. దీంతో ప్రభుత్వంపై ప్రజలకు భరోసా పెరిగిందని టెలీకాన్ఫరెన్స్‌లో వ్యాఖ్యానించారు.


