News March 15, 2025

కమ్యూనిటీ మీడియేషన్ వాలంటీర్లుగా పేర్లు నమోదు చేసుకోవాలి: పి.నారాయణ బాబు

image

భూపాలపల్లి జిల్లాలోని ప్రతీ గ్రామం నుంచి డిగ్రీ చదువుకొని ఉచితంగా సేవ చేయాలనే గుణం కలిగిన యువత కమ్యూనిటీ మీడియేషన్ వాలంటీర్లుగా పేర్లు నమోదు చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.నారాయణ బాబు తెలిపారు. కేసులను గ్రామస్థాయిలోనే పరిష్కరించాలనే బృహత్తర కార్యక్రమానికి జిల్లా న్యాయసేవాధికార సంస్థ శ్రీకారం చుట్టిందని వారన్నారు. రాజీ మార్గంలో కేసులను పరిష్కారం చేయడం జరుగుతుందని ఆయన అన్నారు.

Similar News

News February 24, 2026

జగిత్యాల: గోదావరి పుష్కరాలపై ఎస్పీ సమీక్ష

image

జగిత్యాల జిల్లాలో జరగనున్న గోదావరి పుష్కరాలు-2027 నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లపై జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ సమీక్షా సమావేశం నిర్వహించారు. పుష్కర ఘాట్‌లు, వీఐపీ ఘాట్‌లు, తాత్కాలిక స్నాన ఘాట్‌ల వద్ద కట్టుదిట్టమైన బందోబస్తు, సీసీ కెమెరాల ఏర్పాటు, మహిళల భద్రతపై ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రోజుకు సుమారు 15 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశముండటంతో ట్రాఫిక్ నియంత్రణ, వన్‌వే మార్గాలు చూడాలన్నారు.

News February 24, 2026

రీ-సర్వే ప్రక్రియను వేగవంతం చేయాలి: కలెక్టర్ వెట్రిసెల్వి

image

జిల్లాలో రీ-సర్వే పురోగతిపై కలెక్టర్ వెట్రి సెల్వి మంగళవారం ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రత్యేక సీఎస్ సాయి ప్రసాద్, ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ కమిషనర్ జయలక్ష్మికి వివరాలు వెల్లడిస్తూ.. 248 గ్రామాల్లో సర్వే చేపట్టామన్నారు. ఇప్పటికే మూడు దశల్లో 113 గ్రామాల్లో ప్రక్రియ పూర్తయిందని, ప్రస్తుతం 40 గ్రామాల్లో నాలుగో దశ లక్ష్యంగా పనులు జరుగుతున్నాయని కలెక్టర్ వివరించారు.

News February 24, 2026

తూ.గో: ‘ఆ పాల పదార్థాలను వినియోగించవద్దు’

image

గణేశ్వరరావు నుంచి కొనుగోలు చేసిన పాలు, ఇతర పాల ఉత్పత్తులను వినియోగించరాదని కలెక్టర్ కీర్తి చేకూరి మంగళవారం స్పష్టం చేశారు. గణేశ్వరరావు సరఫరా చేసిన పాలు కల్తీ అయినట్లు గుర్తించామన్నారు. ఈ పాలు, వాటి ద్వారా తయారైన పెరుగు, కోవా, నెయ్యి, మీగడ వంటి పదార్థాలు ఎక్కడ నిల్వ ఉన్నా వెంటనే తొలగించి, సురక్షితంగా నాశనం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా ఈ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.