News March 15, 2025
Weather Report: బాబోయ్ ఎండలు.(జాగ్రత్త)

జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. గత 10రోజులుగా పోల్చుకుంటే 3.3 డిగ్రీల అధిక ఉష్ణోగ్రత నమోదుతున్నాయి. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింతగా పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. సుమారుగా 42డిగ్రీలకు పైగా నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ఎండ తీవ్రతతో పాటు వడగాలు కూడా అధికంగా ఉండే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. బహిరంగ ప్రదేశాల్లో పనిచేసే వారు జాగ్రత్తగా ఉండాలని నిపుణలు సూచిస్తున్నారు.
Similar News
News March 16, 2025
MNCL: అంతర్జాతీయ సైన్స్ సదస్సుకు సాయి శ్రీవల్లి

మంచిర్యాలలోని ఓ ప్రైవేటు పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థిని సాయి శ్రీవల్లి అంతర్జాతీయ సైన్స్ సదస్సుకు ఎంపికైంది. జూన్ 15 నుంచి 21వరకు జపాన్లో జరిగే సకురా అంతర్జాతీయ సైన్స్ సదస్సులో ఆమె పాల్గొననుంది. స్త్రీల నెలవారి రుతుక్రమం ప్రక్రియలో ఆరోగ్య సమస్యల పరిష్కారానికి శ్రీజ సొంతంగా రుతుమిత్ర కిట్ పరికరం రూపొందించింది. ఈ సందర్భంగా డీఈఓ యాదయ్య, సైన్స్ అధికారి మధుబాబు ఆమెను అభినందించారు.
News March 16, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి
News March 16, 2025
మంచిర్యాల: తండ్రిపై దాడికి సుపారి ఇచ్చిన కొడుకు

తండ్రిపై దాడి చేయించేందుకు సుఫారి ఇచ్చిన కొడుకుతో పాటు ఐదుగురు నిందితులను అరెస్టు చేసినట్లు రూరల్ CI అశోక్ తెలిపారు. మంచిర్యాల జిల్లా వేంపల్లికి చెందిన సత్యానందం, కొడుకు రమేశ్కు కుటుంబ కలహాలు ఉన్నాయి. దీంతో పలువురికి రూ.50వేలు ఇచ్చి హోలీ రోజు తండ్రిపై దాడి చేయించాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి 24గంటల్లోగా నిందితులను అరెస్టు చేసి బంగారం, నగదు స్వాధీనం చేసుకున్నట్లు CI వెల్లడించారు.