News March 15, 2025
తడ: లారీ ఢీకొని వ్యక్తి స్పాట్ డెడ్

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన ఘటన తడ మండలంలో చోటుచేసుకుంది. ఎస్ఐ కొండప్ప నాయుడు తెలిపిన వివరాల మేరకు.. శుక్రవారం రాత్రి చెన్నై వైపు రోడ్డు మార్షన్‌లో నిలబడిన రవి అనే వ్యక్తిని లారీ వేగంగా వచ్చి ఢీకొంది. ఈ ఘటనలో వ్యక్తి తలకు తీవ్రగాయాలు కాగా, అక్కడికక్కడే చనిపోయాడు. మృతుని కుమారుడు అజిత్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
Similar News
News April 17, 2026
మిల్లర్లు రైతులకు అండగా నిలవాలి: కలెక్టర్

నల్లగొండ జిల్లాలో రబీ ధాన్యం సేకరణను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని, మిల్లులకు వస్తున్న ధాన్యాన్ని ఏమాత్రం జాప్యం చేయకుండా అన్ లోడ్ చేయాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ మిల్లర్లను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో మిల్లర్లు, సంబంధిత అధికారులతో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. కొనుగోలు కేంద్రాల నుంచి వస్తున్న ధాన్యం లోడుతో మిల్లుల వద్ద లారీలు పడిగాపులు కాయకూడదని అన్నారు.
News April 17, 2026
జ్వరంతో ఉన్నప్పుడు పిల్లలకు ఇవి పెట్టకూడదు

పిల్లలకు జ్వరం వచ్చినప్పుడు వేయించిన పదార్థాలు, బజ్జీలు, పకోడీలు, చిప్స్ వంటివి పెట్టకూడదు. ఇవి త్వరగా జీర్ణం కావు, కడుపునొప్పి, అజీర్తి కలిగిస్తాయంటున్నారు నిపుణులు. అలాగే చాక్లెట్స్, కేక్, జ్యూస్ వంటి తీపి పదార్థాలు కూడా తగ్గించాలి. షుగర్ ఎక్కువ ఉన్న ఆహారం శరీరంలో ఇన్ఫ్లమేషన్ పెరగడానికి, ఇమ్యూనిటీ తగ్గడానికి కారణం అవుతుంది. ప్యాక్డ్, ప్రాసెస్డ్ ఫుడ్స్ కూడా ఇవ్వకూడదని చెబుతున్నారు.
News April 17, 2026
సిద్ధిపేట కేవీలో ఇంటర్ ప్రవేశాలకు నోటిఫికేషన్

సిద్ధిపేట జిల్లా కేంద్రంలోని కేంద్రీయ విద్యాలయంలో 2026-27 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ శ్రీకాంత్ తెలిపారు. ఈ నెల 25 వరకు పాఠశాలలో నేరుగా దరఖాస్తులు సమర్పించవచ్చు. మొత్తం 40 సీట్లకు గాను, మొదట కేవిలో పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థులకు ప్రాధాన్యం ఉంటుంది. మిగిలిన సీట్లను కేవీ సంఘటన్ నిబంధనల ప్రకారం భర్తీ చేస్తారు.


