News March 15, 2025

నిర్మల్‌: పరీక్షలో 151 మంది విద్యార్థుల గైర్హాజరు

image

నిర్మల్ జిల్లాలోని 23 పరీక్ష కేంద్రాల్లో శనివారం నిర్వహించిన ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షకు 151 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు డీఐఈఓ పరుశురాం తెలిపారు. మొత్తం 5,559 మంది విద్యార్థులకు గానూ 5,408 మంది పరీక్షకు హాజరైనట్లు వెల్లడించారు.

Similar News

News March 17, 2025

రామాయంపేట: అప్పుల బాధతో ఆత్మహత్య

image

అప్పుల బాధ తాళలేక ఒక యువకుడు పురుగుల మందు తాగి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన రామాయంపేట మండలంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని ఆరు వెంకటాపూర్ గ్రామానికి చెందిన పుర్ర రమేష్ వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. గత సోమవారం ఆర్థిక ఇబ్బందులతో పురుగుల మందు సేవించారు. బంధువులు ఆసుపత్రికి తరలించడంతో చికిత్స పొందుతూ మృతి చెందారు.

News March 17, 2025

పెద్దపల్లి జిల్లాలో భగ్గుమంటున్న భానుడు

image

వేసవి నేపథ్యంలో పెద్దపల్లి జిల్లాలో ఎండల తీవ్రత పెరుగుతోంది. సోమవారం కాల్వ శ్రీరాంపూర్ మండలంలో సరాసరి గరిష్ఠ ఉష్ణోగ్రత 40.9℃గా నమోదైందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అటు చలి తీవ్రత కూడా తగ్గడంతో ఓదెల మండలంలో 18.0℃ సరాసరి కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కాగా, ఇప్పటికే జిల్లా ప్రజలు ఉక్కుపోతతో ఇబ్బందులు పడుతున్నారు. మధ్యాహ్నం సమయంలో వేడి తీవ్రత మరింత ఎక్కువగా ఉంటోంది.

News March 17, 2025

GOLD: ప్రాఫిట్ బుకింగ్ టైమ్ వచ్చేసిందా!

image

చివరి మూడేళ్లలో ఏటా బంగారం 17% రాబడి అందించింది. ఔన్స్ రేటు $3000ను తాకడంతో ప్రాఫిట్ బుక్ చేసుకోవడంపై ఇన్వెస్టర్లు సందిగ్ధంలో పడ్డారు. Sensex to Gold రేషియోను బట్టి నిర్ణయించుకోవడం బెటర్ అంటున్నారు Edelweiss SVP నిరంజన్ అవస్థి. 1999 నుంచి ఈ రేషియో 1కి దిగువన ఉంటే తర్వాతి మూడేళ్లలో ఈక్విటీస్, 1 కన్నా ఎక్కువుంటే తర్వాతి మూడేళ్లలో గోల్డ్ రాణిస్తోంది. ప్రస్తుతమిది లాంగ్‌టర్మ్ సగటు 0.96కు దిగువన ఉంది.

error: Content is protected !!