News March 15, 2025
దుర్గాప్రసాద్ ఫ్యామిలీకి అండగా ఉంటాం: పవన్ కళ్యాణ్

అమలాపురం నియోజకవర్గం ఈదరపల్లికి చెందిన జన సైనికుడు అడపా దుర్గాప్రసాద్ ఆత్మకు శాంతి చేకూరాలని పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు. ‘జనసేన సభ నుంచి వెళ్తూ దుర్గాప్రసాద్ చనిపోయారని తెలిసి చింతిస్తున్నా. అతని కుటుంబానికి జనసేన అన్ని విధాలా అండగా ఉంటుంది’ అని పవన్ అన్నారు. పిఠాపురంలో నిన్న దుర్గాప్రసాద్‌కు కళ్లు తిరగ్గా.. బస్సులో కూర్చోపెట్టారు. ఇంటికి వచ్చాక గుండెపోటుతో చనిపోయారని స్థానికులు తెలిపారు.
Similar News
News March 15, 2026
నల్గొండలో జన గణనకు రెడీ

నల్గొండలో జనగణన కోసం అధికారులు సన్నాహాలు వేగవంతం చేస్తున్నారు. 2011 జనగణన ప్రకారం జిల్లాలో మొత్తం జనాభా 34,88,809. పురుషులు 17,58,772, మహిళలు 17,29,037. తాజా గణనలో సుమారు 16,18,416 కుటుంబాల వివరాలు సేకరించడమే లక్ష్యం. గ్రామీణ ప్రాంతాల్లో 8,18,306, పట్టణాల్లో 8,00,110 కుటుంబాల నుంచి సమాచారం నమోదు చేయనున్నారు. ఇంటింటి సర్వేకు సిబ్బందికి శిక్షణ ఇచ్చి డిజిటల్ విధానంలో డేటా తీసుకోనున్నారు.
News March 15, 2026
నకిలీ సందేశాలను నమ్మవద్దు : విద్యుత్ శాఖ

విద్యుత్ బిల్లుల పేరుతో వినియోగదారులకు పంపుతున్న నకిలీ సందేశాలను నమ్మవద్దని ఏపీఎస్పీడీసీఎల్ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ శివశంకర్ లోతేటి శనివారం ఒక ప్రకటనలో కోరారు. మీ విద్యుత్ బిల్లు బకాయి ఉందని, వెంటనే చెల్లించకపోతే విద్యుత్ సరఫరాను నిలిపివేస్తామని మెసేజ్‌లు వస్తున్నాయన్నారు. మరిన్ని వివరాల కోసం ఒక ఫోన్ నంబరును సంప్రదించాలంటూ సందేశాలు అందుతున్నట్లు తమ దృష్టికి వచ్చినట్లు తెలిపారు.
News March 15, 2026
నెల్లూరు: ఉదయాన్నే రామాపురం వద్ద ప్రమాదం

వరికుంటపాడు మండలం రామాపురం జాతీయ రహదారిపై చింతపండు లోడుతో వెళ్తున్న ఐచర్ అదుపుతప్పి బోల్తా కొట్టింది. హిందూపూర్ నుంచి కనిగిరి వైపు చింతపండు లోడుతో వెళ్తుండగా డ్రైవర్ నిద్ర మత్తులో ఉండగా ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో డ్రైవర్ దాదా పీర్‌కి స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన డ్రైవర్‌ను 108 వాహనంలో ఉదయగిరి ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.


