News March 15, 2025
ఎన్నికల కోసమే డీఎంకే హిందీ డ్రామా: కిషన్ రెడ్డి

TG: తమిళనాడులో ఎన్నికల సమయం దగ్గర పడుతోందని, అందుకే డీఎంకే పార్టీ ప్రజలను రెచ్చగొట్టి అధికారంలోకి రావాలని చూస్తోందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఫైరయ్యారు. త్రిభాషా పాలసీ కొత్తదేం కాదని, దేశంలో ఎక్కడా హిందీ భాషను రుద్దడం లేదని స్పష్టం చేశారు. తమిళ భాష అభివృద్ధికి స్టాలిన్ ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. డీలిమిటేషన్‌పైనా డీఎంకే తప్పుడు ప్రచారం చేస్తోందని విమర్శించారు.
Similar News
News January 9, 2026
బాపట్ల: భార్యను చంపాడు.. చివరికి.!

నిజాంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో 2022లో జరిగిన భార్య హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు, రూ.2 వేల జరిమానా విధిస్తూ తెనాలి 11వ అదనపు జిల్లా సెషన్స్ కోర్టు గురువారం తీర్పు వెలువరించింది. భార్యను హత్య చేసిన భర్తకు కఠిన శిక్ష పడేలా సమగ్ర దర్యాప్తు, బలమైన సాక్ష్యాలు అందించిన పోలీసు అధికారులను ఎస్పీ బి.ఉమామహేశ్వర్ అభినందించారు. నేరస్తులకు శిక్షలు పడితేనే బాధితులకు న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు.
News January 9, 2026
PMV 480(అల్లూరి).. అధిక పోషకాల వరిగ రకం

‘వరిగ’ ఒక రకమైన చిరుధాన్యం. వీటిలో ఫైబర్, కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్, కొవ్వు ఆమ్లాలు సమృద్ధిగా ఉంటాయి. వీటిని అన్నం, అట్లు, మురుకుల తయారీలో ఉపయోగిస్తారు. విజయనగరం వ్యవసాయ పరిశోధనా స్థానం రూపొందించిన PMV 480(అల్లూరి) రకం వరిగ వంగడాన్ని తాజాగా విడుదల చేశారు. దీని పంటకాలం 72-77 రోజులు. ఇది ఖరీఫ్‌కు అనుకూలం. హెక్టారుకు 2.27 టన్నుల దిగుబడి వస్తుంది. మిగిలిన వాటి కంటే ఈ రకంలో ప్రొటీన్ శాతం అధికం.
News January 9, 2026
IIT ఇండోర్‌లో ఉద్యోగాలు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

<


