News March 15, 2025
రోజూ సాయంత్రం వీటిని తింటున్నారా?

చాలామందికి సాయంత్రం కాగానే ఏదో ఒక స్నాక్ తినాలని అనిపిస్తుంది. అలా అని ఏదిపడితే అది తినడం మంచిది కాదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. పెనంపై వేయించిన శనగలు తింటే పోషకాలు అందుతాయి. ఉడకపెట్టిన మొక్కజొన్న తింటే ఫైబర్ లభిస్తుంది. బాదం పప్పు, నల్లద్రాక్ష, పిస్తా, వాల్నట్స్, పండ్లు వంటివి తింటే ప్రొటీన్లు లభిస్తాయి. నూనెలో ముంచి తీసిన బజ్జీలు, పునుగులు, పకోడీ వంటివి తింటే ఆరోగ్యానికి హాని కలగొచ్చు.
Similar News
News January 30, 2026
పొడవైన నడక దారి.. మొత్తం 22,387కి.మీలు

దక్షిణాఫ్రికాలోని కేప్ టౌన్ నుంచి రష్యాలోని మగదాన్ వరకు ఉన్న మార్గం ప్రపంచంలోనే అత్యంత పొడవైన నడక దారి. ఇది 17 దేశాల గుండా సుమారు 22,387 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఈ ప్రయాణంలో ఎక్కడా విమానాలు లేదా పడవలు అవసరం లేదు. కేవలం నడిచి వెళ్లవచ్చు. అయితే యుద్ధాలు, వీసా కష్టాలు, విపరీతమైన చలి వల్ల దీనిని పూర్తి చేయడం దాదాపు అసాధ్యం. ఇప్పటివరకు ఎవరూ ఈ సుదీర్ఘ ప్రయాణాన్ని సాహసించలేదు.
News January 30, 2026
అమ్మాయిలకు ఫ్రీగా శానిటరీ ప్యాడ్స్ అందించాలి: సుప్రీంకోర్టు

మహిళల Menstrual health వారి జీవించే హక్కులో భాగమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. స్కూల్ అమ్మాయిలందరికీ బయో డీగ్రేడబుల్ శానిటరీ ప్యాడ్స్ ఉచితంగా అందేలా చూడాలని అన్ని రాష్ట్రాలను ఆదేశించింది. అలాగే ప్రతి స్కూల్లో అమ్మాయిలు, అబ్బాయిలకు వేర్వేరుగా టాయిలెట్స్ ఉండాలని, అవి వికలాంగులకూ అనుకూలంగా ఉండాలని సూచించింది. ఒకవేళ ప్రైవేట్ స్కూల్స్ ఇవి పాటించకపోతే వాటి గుర్తింపు రద్దు చేస్తామని హెచ్చరించింది.
News January 30, 2026
కాంగ్రెస్‌లోనే ఉంటా: థరూర్

తాను కాంగ్రెస్‌లోనే ఉంటానని, ఎక్కడికీ వెళ్లడం లేదని INC MP శశిథరూర్ స్పష్టం చేశారు. కేరళ ఎన్నికల్లో UDFను గెలిపించేందుకు పనిచేస్తానన్నారు. పార్టీపై అసంతృప్తితో ఉన్న థరూర్ తాజాగా అగ్రనేతలు ఖర్గే, రాహుల్‌తో భేటీ అయ్యారు. పార్టీతో విభేదాలు లేవని మీడియాతో పేర్కొన్నారు. ‘నేను చేసిన వ్యాఖ్యలు BJPకి అనుకూలమని కొందరు భావించొచ్చు. కానీ అవి భారత్‌కు అనుకూలం. రాహుల్ నిజాయతీ కల నేత’ అని పేర్కొన్నారు.


