News March 15, 2025

జనం ఛీ కొట్టినా.. జగన్ మారట్లేదు: మంత్రి లోకేశ్

image

AP: వైసీపీ రాక్ష‌స మూక‌ల దాడిలో మృతిచెందిన‌ చిత్తూరు(D) కృష్ణాపురానికి చెందిన TDP కార్యకర్త రామకృష్ణకు క‌న్నీటి నివాళులు అర్పిస్తున్నట్లు మంత్రి లోకేశ్ తెలిపారు. ఈ దాడిలో గాయ‌ప‌డిన రామ‌కృష్ణ కుమారుడు సురేశ్‌కు మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు వివరించారు. జనం ఛీ కొట్టినా మాజీ CM జగన్ హ‌త్యా రాజ‌కీయాలు మాన‌డం లేదని మండిపడ్డారు. YCP ర‌క్త‌చ‌రిత్ర‌కు TDP సైనికుడిని కోల్పోవ‌డం చాలా బాధాకరమన్నారు.

Similar News

News March 16, 2025

పద్మ అవార్డుల దరఖాస్తులకు ఆహ్వానం

image

జనవరి 26 గణతంత్ర వేడుకల సందర్భంగా ప్రకటించే పద్మ అవార్డులకు కేంద్ర ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానించింది. ఆసక్తి ఉన్నవారు జులై 31లోగా http://awards.gov.in వెబ్‌సైట్‌లో నామినేషన్లు అప్‌లోడ్ చేయాలని వెల్లడించింది. అదే విధంగా రాష్ట్రీయ పురస్కార్ పోర్టల్‌లో నామినేషన్లు/ సిఫార్సులను పంపించవచ్చని తెలిపింది. 2026 సంవత్సరానికి సంబంధించి అవార్డుల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తుంది.

News March 16, 2025

మస్క్ కుమారునికి సహాయం చేసిన ట్రంప్

image

మస్క్ కుమారుడిని ట్రంప్ హెలికాప్టర్ ఎక్కిస్తున్న ఫొటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. అమెరికా అధ్యక్షుడు ఫ్లోరిడాలోని తన ఇంటికి బయలుదేరగా ఆయనతో పాటు మస్క్ కుమారుడు వెళ్లాడు. ఆ ఛాపర్‌లోనికి ఎక్కడానికి పిల్లాడు ఇబ్బంది పడగా ట్రంప్ అతనికి సహాయం చేశారు. ఈ చిత్రాన్ని మస్క్ రీపోస్టు చేశారు. గత కొద్దిరోజులుగా టెస్లా అధినేత తన కుమారున్ని USA అధికార కార్యక్రమాలకు వెంట తీసుకెళుతున్న సంగతి తెలిసిందే.

News March 16, 2025

కన్నప్ప స్వగ్రామానికి మంచు విష్ణు

image

సినీ నటుడు మంచు విష్ణు శివభక్తుడు కన్నప్ప స్వగ్రామాన్ని సందర్శించారు. తన మూవీ టీమ్‌తో కలిసి అన్నమయ్య జిల్లాలోని రాజంపేట మండలం ఊటుకూరుకు వెళ్లారు. అక్కడి శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయాన్ని అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. అయితే విష్ణు హీరోగా తెరకెక్కిన కన్నప్ప చిత్రం ఏప్రిల్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో ప్రభాస్, అక్షయ్‌కుమార్‌తో పాటు ఇతర స్టార్‌లు నటించారు.

error: Content is protected !!