News March 15, 2025
గ్రూప్ 2, 3 ఫలితాల్లో మంచిర్యాల యువకుడి సత్తా

గ్రూప్ 2,3 ఫలితాల్లో మంచిర్యాల ఆర్ఆర్ నగర్‌కు చెందిన మండల సుమంత్ గౌడ్ సత్తా చాటారు. శుక్రవారం విడుదలైన గ్రూప్ 3 ఫలితాల్లో 102వ ర్యాంకు సాధించారు. కాగా గతంలో విడుదలైన గ్రూప్ 2 ఫలితాల్లో 172 ర్యాంకు సాధించడం విశేషం. ప్రస్తుతం హైదరాబాద్ జీహెచ్ఎంసీలో జూనియర్ అసిస్టెంట్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. దీంతో ఆయన్ను పలువురు అభినందించారు.
Similar News
News January 15, 2026
అమెరికా సంచలన నిర్ణయం.. పాకిస్థాన్‌కు షాక్

అగ్రరాజ్యం అమెరికా మరో కీలక నిర్ణయం తీసుకుంది. జనవరి 21 నుంచి 75 దేశాల పౌరులకు వీసా ప్రాసెసింగ్‌ను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. అక్రమ వలసలను నియంత్రించడమే లక్ష్యంగా చర్యలు చేపట్టినట్లు వెల్లడించింది. ఈ జాబితాలో పాకిస్థాన్, బ్రెజిల్, రష్యా, ఇరాన్, సోమాలియా, అఫ్గానిస్థాన్ సహా అనేక దేశాలు ఉన్నాయి. గత కొంత కాలంగా USతో సన్నిహితంగా ఉంటున్న పాక్‌కు ఈ నిర్ణయం పెద్ద షాక్ అనే చెప్పుకోవచ్చు.
News January 15, 2026
ఏలూరులో ఎండ్ల బండిపై ఎస్పీ దంపతుల సందడి

ఏలూరులో పోలీసు ప్రధాన కార్యాలయ ఆవరణలో సంక్రాంతి సంబరాలను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఎస్పీ ప్రతాప శివ కిషోర్, ఆయన సతీమణి ధాత్రి రెడ్డి (రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ సీఈవో) దంపతులు సంప్రదాయబద్ధంగా భోగి మంటలు వేసి, చిన్నారులకు భోగి పళ్లు పోశారు. అనంతరం పల్లె వాతావరణాన్ని ప్రతిబింబించేలా ఎడ్లబండిపై విహరించి అందరినీ అలరించారు. ఈ వేడుకల్లో పోలీసు కుటుంబాలు ఉత్సాహంగా పాల్గొన్నాయి.
News January 15, 2026
TODAY HEADLINES

⁎ తెలుగు రాష్ట్రాల్లో భోగి వేడుకలు.. పాల్గొన్న రాజకీయ ప్రముఖులు
⁎ జర్నలిస్టుల అరెస్ట్.. ఖండించిన బండి సంజయ్, YS జగన్, KTR
⁎ శబరిమలలో దర్శనమిచ్చిన మకరజ్యోతి
⁎ ఢిల్లీలో పొంగల్ వేడుకలు.. పాల్గొన్న పీఎం మోదీ
⁎ రూ.15,000 పెరిగిన వెండి ధర
⁎ రెండో వన్డేలో భారత్‌పై న్యూజిలాండ్ విజయం
⁎ ఇరాన్‌ను వీడాలని భారతీయులకు ఎంబసీ సూచన


