News March 15, 2025
గవర్నర్‌ను కలిసిన వివేకా కుమార్తె సునీత

AP: మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసుకు సంబంధించి ఆయన కుమార్తె సునీత రాజ్ భవన్‌లో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌ను కలిశారు. తన తండ్రి హత్య కేసు విచారణ వేగవంతం చేయాలని ఆమె కోరారు. ఈ సందర్భంగా హత్య కేసులో కీలక పరిణామాలను ఆయనకు వివరించారు. వివేకా హత్య జరిగి 6 ఏళ్లు అయిందని, న్యాయం కోసం అప్పటి నుంచి పోరాడుతూనే ఉన్నానని ఆమె ఇటీవల వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలోనే గవర్నర్‌ను కలిశారు.
Similar News
News March 26, 2026
₹20 వేల స్టైపెండ్‌తో NHAIలో ఇంటర్న్‌షిప్!

సమ్మర్‌లో 2 నెలల ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌కు NHAI దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. APR 15వ తేదీ వరకు <
News March 26, 2026
సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల పని వేళల పొడిగింపు

తెలంగాణ రిజిస్ట్రేషన్ల శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. 2025-26 ఆర్థిక సంవత్సరం మార్చి 31తో ముగియనున్న నేపథ్యంలో రద్దీని దృష్టిలో ఉంచుకొని పని వేళలను పొడిగించింది. ఈ నెల 28, 30, 31 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు 9:30am నుంచి 8:30pm వరకు పని చేస్తాయని చెప్పింది. రిజిస్ట్రేషన్ స్లాట్ల సంఖ్యనూ పెంచింది. సెలవులు తీసుకోకుండా పనిచేయాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేసింది.
News March 26, 2026
50ల్లోనూ యవ్వనంగా.. మలైకా సీక్రెట్ ఇదే?

3 రకాల వాటర్ షాట్స్ థెరపీ 52 ఏళ్ల వయసులోనూ తనను ఫిట్&అందంగా ఉంచుతోందని మలైకా అరోరా తెలిపారు.
ఇమ్యూనిటీ షాట్: అల్లం, పసుపు, పుదీనా, తులసి ఆకులు, చియా సీడ్స్, తేనె కలిసిన నీటిని తాగడం.
డైజెస్టివ్ షాట్: రాత్రి గ్లాస్ వాటర్‌లో టీస్పూన్ చొప్పున వాము, జీలకర్ర, సోంపు, మెంతి గింజలు నానబెట్టిన నీరు తీసుకోవడం.
గ్లో షాట్: అలోవేరా జెల్ కలిపిన నీటిలో అవసరమైతే చియా సీడ్స్, సబ్జా గింజలు యాడ్ చేసుకొని తాగడం.


