News March 15, 2025

రాజమండ్రి: రైల్వే చీఫ్ క్రూ కంట్రోలర్‌గా శ్రీనివాసరావు

image

దక్షిణ మధ్య రైల్వే రాజమండ్రిలో చీఫ్ క్రూ కంట్రోలర్‌గా శ్రీనివాసరావు నియమితులయ్యారు. ఇదే పదవిలో ఉన్న బీవీ బీకే రెడ్డి స్వచ్ఛందంగా రిటైరయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన నుంచి శ్రీనివాసరావు బాధ్యతలు స్వీకరించారు. ఉన్నతాధికారులు, క్రిందిస్థాయి ఉద్యోగులను సమన్వయం చేసుకుంటూ తన విధులను సమర్థవంతంగా నిర్వహిస్తానని శ్రీనివాసరావు తెలిపారు.

Similar News

News January 18, 2026

తూ.గో: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

image

కొవ్వూరు మండలం దేచర్ల సమీపంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మట్ట సత్యనారాయణ (40) అక్కడికక్కడే మృతి చెందాడు. పంగిడి నుంచి ద్విచక్ర వాహనంపై వస్తుండగా ఆటో ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. సత్యనారాయణతో పాటు ఉన్న కోటి అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. మృతుడు క్రషర్ కార్మికుడిగా పనిచేస్తున్నట్లు సమాచారం. సత్యనారాయణకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

తెలుగు జాతి ఖ్యాతి ఎన్టీఆర్: పురందీశ్వరి

image

ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా రాజమండ్రి ఎంపీ పురందీశ్వరి ఆదివారం ఆయనకు ఘన నివాళులర్పించారు. ఒక ఉత్తమ నాయకుడు జన్మిస్తే ఆ వంశానికే కాక మొత్తం జాతికే గుర్తింపు వస్తుందని కొనియాడారు. ఉన్నత విలువలు కలిగిన ఎన్టీఆర్ వల్ల తెలుగు ప్రజలకు ప్రపంచవ్యాప్త ఖ్యాతి లభించిందని పేర్కొన్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఎన్టీఆర్ ఫోటోను షేర్ చేస్తూ తన తండ్రి జ్ఞాపకాలను పురందీశ్వరి స్మరించుకున్నారు.