News March 15, 2025

నెల్లూరు: ప్రశాంతంగా ముగిసిన ఇంటర్ పరీక్షలు

image

నెల్లూరు జిల్లాలో ఇంటర్మీడియట్ ప్రధాన పరీక్షలు శనివారంతో ప్రశాంతంగా ముగిశాయని జిల్లా ప్రాంతీయ ఇంటర్మీడియట్ బోర్డ్ అధికారి డాక్టర్ ఏ. శ్రీనివాసులు తెలిపారు. శనివారం జరిగిన పరీక్షల జనరల్ విభాగంలో 23,199 మందికి గాను 458 మంది గైర్హాజరు అయ్యారని తెలిపారు. ఒకేషనల్ విభాగంలో 431 మందికి గాను 61 మంది గైర్హాజరు అయ్యారు. ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా జరగడంతో జిల్లా అధికారులందరికీ ఆర్‌ఐ‌ఓ ధన్యవాదాలు తెలిపారు.

Similar News

News March 29, 2026

రాజకీయాల నుంచి శాశ్వతంగా వైదొలగుతా: బీదా మస్తాన్ రావు

image

నెల్లూరు జిల్లాలోని జువ్వలదిన్నె బోట్ల మాయానికి సంబంధించి తన ప్రమేయం ఉందని ఆధారాలతో సహా ఒక్క శాతం నిరూపించినా తన స్థానానికి రాజీనామా చేస్తానని బీదా మస్తాన్ యాదవ్ ప్రకటించారు. అంతేకాకుండా రాజకీయాల నుంచి శాశ్వతంగా వైదొలుగుతానన్నారు. నెల్లూరు నగరంలోని తన నివాసంలో ఆదివారం సమావేశం ఏర్పాటు చేశారు. కొంతమంది రాజకీయ కుట్రతో తనపై దుష్ప్రచారం చేస్తున్నారన్నారు.

News March 29, 2026

నెల్లూరులో దొంగలు ‘రూట్ మార్చారు’

image

గ్యాస్ సిలిండర్లకు డిమాండ్ ఏర్పడడంతో నెల్లూరులో కొత్త తరహా దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఇటీవల బుచ్చిలో 3 గ్యాస్ సిలిండర్లు చోరీకి గురవుగా.. తాజాగా నెల్లూరు రూరల్ వెల్లంటిలో 2 సిలిండర్లు అపహరించారు. వెల్లంటిలోని జెడ్పీ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో రెండు సిలిండర్ల అపహరణపై స్థానిక అంగన్వాడీ టీచర్ మమత పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News March 28, 2026

కందుకూరు: రోడ్డు ప్రమాదంలో ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ మృతి

image

కందుకూరులోని సింహాద్రి నగర్‌కు చెందిన జంపాల వెంకటరమణయ్య (హెడ్ కానిస్టేబుల్), ఒంగోలు ట్రాఫిక్ విభాగంలో విధులు నిర్వహిస్తున్నాడు. శనివారం సాయంత్రం భాగ్యనగర్ మూడో లైన్‌లో బైక్‌పై వెళ్తుండగా అకస్మాత్తుగా కుక్క అడ్డు రావడంతో వాహనం స్కిడ్ అయింది. ఈ ప్రమాదంలో ఆయన తలకు తీవ్ర గాయాలు అయ్యాయి. తక్షణమే స్థానికులు గాయపడిన వెంకటరమణయ్యను ఒంగోలు రిమ్స్ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు.