News March 15, 2025

నటి రన్యా రావు తండ్రిపై ప్రభుత్వం చర్యలు!

image

బంగారం స్మగ్లింగ్ చేస్తూ బెంగళూరులో పట్టుబడిన కన్నడ నటి రన్యా రావు కేసులో ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. ఆమె సవతి తండ్రి, హౌసింగ్ కార్పొరేషన్ DGP రామచంద్రారావును సెలవుల్లో పంపింది. ఆయన స్థానంలో కె.వి.శరత్ చంద్రను నియమించింది. మరోవైపు రన్యారావు బెయిల్ పిటిషన్‌ను ఈడీ న్యాయస్థానం తిరస్కరించింది. ఈ సందర్భంగా తనను కొట్టి తెల్ల కాగితాలపై పోలీసులు సంతకాలు చేయించుకున్నారని రన్యా రావు ఆరోపించారు.

Similar News

News March 17, 2025

IMLT20 విజేతగా ఇండియా మాస్టర్స్

image

IML T20 లీగ్ విజేతగా టీమ్ ఇండియా అవతరించింది. రాయ్‌పూర్‌లో జరిగిన ఫైనల్లో వెస్టిండీస్ మాస్టర్స్‌ను ఇండియా మాస్టర్స్ 6వికెట్ల తేడాతో చిత్తు చేసింది. 149 పరుగుల టార్గెట్‌ను భారత్ 17.1 ఓవర్లలోనే ఛేదించింది. అంబటి రాయుడు 9 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 74 పరుగులు చేసి జట్టుకు అండగా నిలిచారు. ఆరంభంలో సచిన్ (25) మెరుపులు మెరిపించారు. నర్స్ రెండు వికెట్లు సాధించారు. బెస్ట్, బెన్ చెరో వికెట్ తీశారు.

News March 17, 2025

అధికారులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

image

AP: తూర్పు గోదావరి జిల్లా గోపాలపురంలో డయేరియా ప్రబలడంపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు. డయేరియా నివారణకు ఇంటింటి సర్వే చేయాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటికే 20 వైద్య బృందాలను ఏర్పాట్లు చేసినట్లు అధికారులు సీఎంకు వివరించారు.

News March 17, 2025

ఆ నటిని అమ్మ అని పిలుస్తా: కళ్యాణ్ రామ్

image

సీనియర్ నటి విజయశాంతిని అమ్మ అని పిలుస్తానని హీరో నందమూరి కళ్యాణ్ రామ్ చెప్పారు. ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’లో కలిసి నటించడం వల్ల ఆమెతో అనుబంధం పెరిగిందని చెప్పారు. ఈ సినిమాలో తల్లీకొడుకులు ఎందుకు దూరమయ్యారు? తిరిగి ఎలా కలిశారు? అనేదే కీలకమన్నారు. విజయశాంతి ఈ చిత్రానికి ప్రధాన బలమని, పోరాట సన్నివేశాల్లోనూ అద్భుతంగా నటించారని కొనియాడారు. రేపు ఉ.10 గంటలకు ఈ సినిమా టీజర్ విడుదల కానుంది.

error: Content is protected !!