News March 15, 2025
రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని అడ్డుకున్నాం: మంత్రి ఉత్తమ్

TG: ఏపీ ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకానికి (RLIP) కేంద్రం పర్యావరణ అనుమతులు నిరాకరించిందని మంత్రి ఉత్తమ్ తెలిపారు. ఇది తమ సర్కారు సాధించిన విజయమని పేర్కొన్నారు. ఏపీ ప్రభుత్వం అంతర్రాష్ట్ర నిబంధనలను ఉల్లంఘించి RLIP నిర్మాణం చేపట్టిందని కేంద్రం వద్ద తాను వాదనలు వినిపించానని చెప్పారు. దీన్ని అడ్డుకోకుండా ఉండి ఉంటే కృష్ణా పరివాహకంలో దుర్భర పరిస్థితి ఏర్పడేదన్నారు.
Similar News
News March 7, 2026
పెరిగిన ఫార్మసీ, ఆర్కిటెక్చర్ కాలేజీ ఫీజులు

TG: ప్రైవేటు ఫార్మసీ, ఆర్కిటెక్చర్ కళాశాలల్లో కొత్త ఫీజులను ప్రభుత్వం ఖరారు చేసింది. 2025-28 విద్యాసంవత్సరానికి బీఫార్మసీకి గరిష్ఠంగా రూ.1.21 లక్షలు, ఫార్మాడీకి రూ.1.37లక్షలుగా నిర్ధారించింది. గతంతో పోలిస్తే 10-15% పెరిగింది. కనిష్ఠ ఫీజును రూ.45వేలకు పరిమితం చేసింది. అయితే మెజార్టీ కాలేజీల్లో ఫీజులు రూ.50-80వేల మధ్య ఉన్నాయి. ఇక ఆర్కిటెక్చర్ ఫీజును గరిష్ఠంగా ₹1.32లక్షలుగా సర్కార్ నిర్ణయించింది.
News March 7, 2026
టీమ్ ఇండియాపైనే ఒత్తిడి: షోయబ్ అక్తర్

T20 WC ఫైనల్‌లో టీమ్ ఇండియాపైనే ఒత్తిడి ఉందని పాక్ మాజీ బౌలర్ షోయబ్ అక్తర్ చెప్పారు. ‘అహ్మదాబాద్‌లో 175-200 స్కోరు నమోదు కావచ్చు. ఒకవేళ న్యూజిలాండ్ 225-250 కొడితే భారత్‌పై ప్రెజర్ పడుతుంది. ఎందుకంటే 150 కోట్ల మంది చూస్తుంటారు. పైగా ఇదే గ్రౌండ్‌లో 2023 ODI WC ఫైనల్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఇండియా ఓడింది’ అని అన్నారు. IND టైటిల్ ఫేవరేట్ అని, అయితే NZ గెలవడం కూడా క్రికెట్‌కు మంచిదని అభిప్రాయపడ్డారు.
News March 7, 2026
కర్ణాటక HCలో శ్రీలంక SC జడ్జి పిటిషన్.. ఎందుకంటే?

ఆన్‌లైన్ కంటెంట్ కారణంగా తన పరువుకు భంగం కలుగుతోందని శ్రీలంక SC జడ్జి జస్టిస్ నవాజ్ కర్ణాటక HCలో పిటిషన్ వేశారు. వాటి ఆధారంగా SL మీడియా వ్యతిరేకంగా కథనాలు ప్రచురిస్తోందని, ఆ కంటెంట్ తొలగించేలా ఆదేశాలివ్వాలని కోరారు. కేంద్రం, గూగుల్ INDను ప్రతివాదులుగా చేర్చారు. శ్రీలంక SC జడ్జి తమ దేశంలో పరువునష్టం దావా వేయడం అక్కడి నిబంధనలకు విరుద్ధం. గూగుల్ IND HQ బెంగళూరులో ఉండటంతో పిటిషన్ వేశారు.


