News March 15, 2025
సూపర్ ప్లాన్: ఈ రీఛార్జ్‌తో 365 రోజులు..

తక్కువ ఖర్చుతో ఎక్కువ రోజులు సిమ్ యాక్టివ్‌గా ఉండాలనుకునే యూజర్ల కోసం BSNL మంచి ప్లాన్ అందిస్తోంది. రూ.1,198తో రీఛార్జ్ (రోజుకు రూ.3.28) చేస్తే 365 రోజులు వ్యాలిడిటీ ఉంటుంది. ప్రతి నెలా 300 నిమిషాల వరకు ఏ నెట్‌వర్క్‌కైనా ఉచిత కాలింగ్, 30 ఫ్రీ SMSలతో పాటు నెలకు 3GB డేటా వస్తుంది. దేశమంతటా రోమింగ్ సమయంలో ఉచిత ఇన్‌కమింగ్ కాల్స్ పొందొచ్చు. BSNLను సెకండ్ సిమ్‌గా ఉపయోగించేవారికి ఇది బెస్ట్ ప్లాన్.
Similar News
News March 16, 2025
మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టు హత్య

లష్కరే తోయిబా మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టు అబు ఖతల్ నిన్న రాత్రి పాకిస్థాన్‌లో హత్యకు గురయ్యాడు. 26/11 ముంబై ఉగ్రవాద దాడులకు మాస్టర్ మైండ్ అయిన హఫీజ్ సయీద్‌కు ఇతడు దగ్గరి అనుచరుడు. సయీద్ ఆదేశాలతో J&Kలోని మైనారిటీలు, భద్రతా బలగాలపై దాడులకు పాల్పడ్డాడు. ఖతల్ పర్యవేక్షణలోనే రియాసీ జిల్లాలోని భక్తుల బస్సుపై దాడి జరిగింది. ఇందులో 9 మంది మరణించారు. ఖతల్ కోసం NIA ఎప్పటినుంచో వెతుకుతోంది.
News March 16, 2025
న్యూజిలాండ్‌తో మ్యాచ్.. 91 రన్స్‌కి పాక్ ఆలౌట్

న్యూజిలాండ్‌తో క్రైస్ట్‌చర్చ్‌లో జరుగుతున్న టీ20 మ్యాచ్‌లో పాక్ 91 పరుగులకే ఆలౌటైంది. ఖుశ్‌దిల్ షా(30 బంతుల్లో 32) మాత్రమే ఫర్వాలేదనిపించారు. సల్మాన్ అఘా(18), జహాందాద్ ఖాన్(17) మాత్రమే రెండంకెల స్కోర్ దాటారు. 11 రన్స్‌కే 4 వికెట్లు కోల్పోయిన పాక్ ఏ దశలోనూ కోలుకునేలా కనిపించలేదు. కివీస్ బౌలర్లలో డఫీ 4 వికెట్లు, జేమీసన్ 3, సోధీ 2, ఫౌక్స్ ఒక వికెట్ తీశారు.
News March 16, 2025
నేడు అమరజీవి జయంతి

మద్రాస్ ప్రెసిడెన్సీలోని తెలుగు ప్రాంతాలతో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కోసం ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి ప్రాణాలర్పించిన అమరజీవి పొట్టి శ్రీరాములు. దీక్ష ప్రారంభించిన తొలిరోజు 53.9 కేజీలు ఉన్న ఆయన 58వ రోజుకు 38.1 కేజీలకు తగ్గారు. 1952 అక్టోబర్ 19 నుంచి డిసెంబర్ 15 వరకు దీక్ష చేశారు. దీక్ష చివరి రోజు ప్రాణాలు వదిలారు. ఈయన పోరాటంతో 1953 OCT 1న కర్నూలు రాజధానిగా ఆంధ్రరాష్ట్రం ఏర్పడింది.