News March 15, 2025

సీఎం సభకు అన్ని ఏర్పాట్లు పూర్తి: కలెక్టర్

image

ఈ నెల 16న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జనగామ జిల్లా ఘనపూర్ (స్టేషన్) నియోజకవర్గ పర్యటనకు ఏర్పాట్లు పూర్తైనట్లు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తెలిపారు. ఈ సందర్భంగా పర్యటనకు సంబంధించి వరంగల్ ఎంపీ కడియం కావ్య, స్టేషన్గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఇతర అధికారులతో కలిసి ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఏర్పాట్లను పరిశీలించారు.

Similar News

News April 5, 2026

జిల్లాలో త్వరలో డోలి యాత్ర: కలెక్టర్

image

పార్వతీపురం జిల్లాలో త్వరలో డోలి యాత్ర ప్రారంభం కానున్నట్లు కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. మారుమూల ప్రాంతాల్లో రవాణా సౌకర్యాలు మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ప్రతి ఆదివారం డోలి రోడ్లపై సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షిస్తామన్నారు. ఇప్పటికే జిల్లాలో డోలి రోడ్లను మంజూరు చేశామని, పూర్తయిన పనులపై ఈ యాత్ర ద్వారా పరిశీలిస్తామన్నారు.

News April 5, 2026

కార్పొరేట్ FDతో అధిక వడ్డీ.. కానీ జాగ్రత్త!

image

సాధారణ బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్ల కంటే కార్పొరేట్ FDలు 1-2% అదనపు వడ్డీని ఆఫర్ చేస్తాయి. అయితే ఇందులో రిస్క్ అధికంగా ఉంటుంది. సదరు సంస్థ ఆర్థిక ఇబ్బందుల్లో పడితే అసలు, వడ్డీ చెల్లింపుల్లో జాప్యం లేదా ఎగవేసే ప్రమాదం ఉంది. ఎలాంటి ఇన్సూరెన్స్ ఉండదు. అందుకే పెట్టుబడి పెట్టే ముందు CRISIL, ICRA వంటి సంస్థలు ఇచ్చే క్రెడిట్ రేటింగ్స్‌ను తప్పక పరిశీలించాలి. అధిక రేటింగ్ ఉన్న సంస్థల్లో భద్రత ఎక్కువ.

News April 5, 2026

TDPలోనే ఉంటాం: నెల్లూరు MP

image

జగన్‌ను కలిసే విషయయై YCP రాజ్యసభ MP అయోధ్య రామిరెడ్డితో నెల్లూరు MP వేమిరెడ్డి చర్చించినట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. ‘మాకు కావాల్సింది గౌరవం. TDP ప్రభుత్వంలో చాలా గౌరవంగా ఉన్నాం. ఇదే పార్టీలోనే కొనసాగుతాం. రాజధానిపై YCPకి స్పష్టతలేదు. మావిగన్ అంటే జనాలు నవ్వుతున్నారు. తమిళనాడు బోట్లను అడ్డుకోవడానికి త్వరలో నెల్లూరుకు 2, తిరుపతి, బాపట్లకు ఒక్కోటి చొప్పున బోట్లు ఇస్తాం’ అని వేమిరెడ్డి చెప్పారు.