News March 16, 2025

HYD: ఓయూ క్యాంపస్‌లో ఇవి బంద్!

image

ఓయూలో ఆందోళనలు, ప్రదర్శనలపై నిషేధం విధిస్తూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ నరేశ్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. దీనిని అతిక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ నిర్ణయంపై విద్యార్థి సంఘాలు మూకుమ్మడిగా మండిపడుతున్నాయి. శాంతియుతంగా నిరసన తెలుపడం ప్రజాస్వామ్య హక్కు అని, దానిని అణిచివేయాలని చూస్తే పెద్దఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరిస్తున్నాయి.

Similar News

News March 17, 2025

మెదక్: ఒంటిపూట బడుల వేళల్లో మార్పులు: డీఈవో

image

మెదక్ జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల పని వేళల్లో మార్పులు చేస్తూ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసిందని జిల్లా విద్యాధికారి రాధా కిషన్ తెలిపారు. పాఠశాలలు ఉదయం 7:45 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు తరగతులు నిర్వహించాలని పేర్కొన్నారు. పదో తరగతి పరీక్ష కేంద్రాలు ఉన్న పాఠశాలలు మధ్యాహ్నం 1 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నడపాలని సూచించారు.

News March 17, 2025

సిద్దిపేట: దంపతుల ఆత్మహత్య.. అనాథలైన చిన్నారులు

image

సిద్దిపేట జిల్లా తొగుట మండలంలో దంపతులిద్దరూ ఆర్థిక ఇబ్బందులతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. వివరాలు.. ఎల్లారెడ్డి పేటకు చెందిన కెమ్మసారం భాగ్యమ్మ (32) ఉదయం పురుగుల మందు తాగే ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయం తెలిసి మనస్థాపానికి గురైన భర్త నాగరాజు (35) సైతం సాయంత్రం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పిల్లలు మీనాక్షి (9), మహేష్(7), లక్కీ (5), శ్రావణ్ (4) అనాథలయ్యారు.

News March 17, 2025

కూతురితో రోహిత్ శర్మ CUTE PHOTOS

image

IPL 2025కు ముందు దొరికిన కాస్త విరామాన్ని రోహిత్ శర్మ కుటుంబ సభ్యులతో కలిసి మాల్దీవులు టూర్‌లో గడిపేస్తున్నారు. ఈ క్రమంలో ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తున్నారు. తాజాగా కూతురు సమైరాతో దిగిన ఫొటోలను ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వీటిని షేర్ చేస్తూ CUTE PHOTO అంటూ కామెంట్లు చేస్తున్నారు.

error: Content is protected !!