News March 16, 2025

Congratulations: ముంబైదే WPL ట్రోఫీ

image

ఉత్కంఠ పోరులో WPL టైటిల్‌ను ముంబై గెలిచింది. 8 పరుగుల తేడాతో ఢిల్లీపై విజయం సాధించి మూడేళ్ల లీగ్ చరిత్రలో రెండో‌సారి కప్ అందుకుంది. ముంబై నిర్దేశించిన 150 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ 9 వికెట్లు కోల్పోయి 141 పరుగులే చేయగలిగింది. నికీ ప్రసాద్ (25*)పోరాడినా ఫలితం లేకపోయింది. కాప్ 40 పరుగులతో రాణించారు. బ్రంట్ 3 వికెట్లతో సత్తా చాటారు. 2023లోనూ ముంబై కప్ గెలిచిన విషయం తెలిసిందే.

Similar News

News September 17, 2025

విశాఖలో జీసీసీ బిజినెస్ సమ్మిట్ ప్రారంభం

image

రుషికొండలోని రాడీసన్‌ బ్లూ హోటల్‌‌లో గ్లోబల్‌ కేపబులిటీ సెంటర్‌ బిజినెస్ సదస్సు ప్రారంభమయ్యింది. ఈ సదస్సులో ముఖ్య అతిథిగా సీఎం చంద్రబాబు హాజరయ్యారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తో పాటు సిఐఐ ప్రతినిధులు హాజరయ్యారు.

News September 17, 2025

స్మృతి మంధాన సూపర్ సెంచరీ

image

AUSWతో జరుగుతున్న రెండో వన్డేలో భారత స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన సెంచరీతో చెలరేగారు. 77బంతుల్లో 12ఫోర్లు, 4సిక్సర్లతో శతకం బాదారు. దీంతో IND తరఫున రెండో ఫాస్టెస్ట్ సెంచరీ చేశారు. తొలి ఫాస్టెస్ట్ సెంచరీ కూడా ఆమె పేరిటే ఉండటం విశేషం. గతంలో స్మృతి ఐర్లాండ్‌పై 70 బంతుల్లోనే శతకం నమోదు చేశారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన IND టీమ్ 32 ఓవర్లలో 191/3 రన్స్ చేసింది. క్రీజులో స్మృతి, దీప్తి శర్మ(12) ఉన్నారు.

News September 17, 2025

పాక్ ‘ఫేక్ ఫుట్‌బాల్ జట్టు’ను వెనక్కి పంపిన జపాన్‌

image

ఫుట్‌బాల్ ఆటగాళ్లమంటూ పాక్ నుంచి తమ దేశానికి వచ్చిన ఫేక్ ప్లేయర్లను జపాన్ వెనక్కి పంపింది. మాలిక్ వకాస్ అనే వ్యక్తి ఫేక్ ఫుట్‌బాల్ జట్టును సృష్టించి 22 మందిని జపాన్‌కు పంపించాడు. అయితే అక్రమంగా వచ్చిన వారిని అధికారులు హెచ్చరించి వెనక్కి పంపించారు. ఈ విషయాన్ని పాకిస్థాన్ ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ సైతం నిర్ధారించింది. వకాస్‌ను అరెస్ట్ చేసి విచారించగా 2024లోనూ ఇదే పద్ధతిలో పంపినట్లు తెలిపాడు.